
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది బుల్లితెరపై చక్రవాకం, మొగలిరేకులు టివి సీరియల్స్ ఎంతలా పాపులర్ అయ్యాయో తెలిసిందే. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్లో ఈ రెండు టివి సీరియల్స్ విశేష ఆదరణ పొందాయి. ఈ రెండు సీరియల్స్ లో నటుడు పవిత్రనాథ్ మంచి గుర్తింపు పొందారు. మొగలి రేకుల సీరియల్ లో దయ పాత్రలో పవిత్రనాథ్ ప్రేక్షకులందరికీ గుర్తుండి పోయాడు. ఆ పాత్రలో చెరగని ముద్ర వేశాడు. కానీ ఊహించని విధంగా పవిత్రనాథ్ అత్యంత పిన్న వయసులోనే మరణించారు.
దయ అలియాస్ పవిత్రనాథ్ మృతి ఇండస్ట్రీలోనే కాదు అభిమానుల్లో సైతం తీవ్ర విషాదంగా మారింది. అయితే పవిత్రనాథ్ మృతికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. మొగలిరేకులు సీరియల్ లో ఇంద్రనీల్ తమ్ముడి పాత్రలో పవిత్రనాథ్ నటించారు. ఇంద్రనీల్ లో రియల్ లైఫ్ లో కూడా పవిత్రనాథ్ కి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది.
పవిత్రనాథ్ మరణవార్తని ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషాదకర సమయంలో మేఘన ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 'పవి.. ఈ భాదని మేము వర్ణించలేకపోతున్నాం. నీవు మా లైఫ్ లో చాలా ముఖ్యమైనవాడివి. నీకు చివరగా గుడ్ బై కూడా చెప్పలేని పరిస్థితి. ఈ వార్త అబద్దం అయితే బావుండు అనిపిస్తుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నాం.. నీ ఆత్మకి శాంతి చేకూరాలి అని పోస్ట్ చేసింది.
అయితే పవిత్రనాథ్ మృతికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. కానీ కొన్నేళ్లుగా పవిత్రనాథ్ పర్సనల్ లైఫ్ పై చాలా వివాదాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం నుంచి పవిత్రనాథ్ భార్య శశిరేఖ అతడిపై ఆరోపణలు చేస్తోంది. పవిత్రనాథ్ కి అమ్మాయిల పిచ్చి ఉందని ఆరోపించింది.
తన ముందే మరో అమ్మాయితో పవిత్రనాథ్ కొన్నేళ్ల పాటు సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపించింది. తన భర్త అయినప్పటికీ ఏ సీరియల్ లో నటిస్తున్నాడు.. ఏం చేస్తున్నాడు ఇలా ఎలాంటి విషయాలు తనకి చెప్పడు అని ఆరోపించింది. ప్రతిరోజు తాగి వచ్చి తనని టార్చర్ పెడుతున్నారు అని శశిరేఖ ఆరోపించింది. అదే సమయంలో పవిత్రనాథ్ అన్ని అవకాశాలు కోల్పోయాడట. దీనితో బాగా మద్యానికి బానిసైనట్లు తెలుస్తోంది. అందువల్లే ఆరోగ్య సమస్యలతో పవిత్రనాథ్ మరణించారా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.