Mamitha Baiju : ‘చిన్నదాన్ని పెద్దగా చేశారు’.. డైరెక్టర్ బాలా కొట్టారనే వార్తలపై హీరోయిన్ మమితా క్లారిటీ

Published : Mar 01, 2024, 09:26 PM IST
Mamitha Baiju :  ‘చిన్నదాన్ని పెద్దగా చేశారు’.. డైరెక్టర్ బాలా కొట్టారనే వార్తలపై హీరోయిన్ మమితా క్లారిటీ

సారాంశం

తమిళ దర్శకుడు బాలా హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju)ను కొట్టారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై తాజాగా యంగ్ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. 

మలయాళం యంగ్ హీరోయిన్ మమితా బైజు(Mamitha Baiju) తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి. తనను ప్రముఖ దర్శకుడు కొట్టాడని చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇక దీనిపై తాజాగా యంగ్ హీరోయిన్ స్పందించింది. అసలు విషయం చెప్పి తప్పుడు వార్తలకు చెక్ పెట్టింది. 

యంగ్ బ్యూటీ మమితా బైజు ప్రకటనలో స్పందిస్తూ.. ’శివపుత్రుడు‘ దర్శకుడు బాలా నన్ను కొట్టారంటూ వార్తలు వచ్చాయి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడిన ఓ చిన్న అంశాన్ని కొందరు పెద్దదిగా చేశారు. బాలా సార్ నన్ను ఫిజికల్ గా, మానసికంగా ఇబ్బంది పెట్టలేదు. ఆయన సినిమా కోసం నేనే ఏడాది పాటు  పనిచేశాను. కానీ వేరే సినిమాలు ఉండటం వల్లనే ఆ సినిమా చేయడం కుదరలేదు.’ అంటూ వివరణ ఇచ్చింది. 

అయితే బాలా నుంచి నెక్ట్స్ ‘వనంగన్’ అనే చిత్రంతో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే చిత్రాన్ని తొలుత సూర్య చేయాల్సి ఉండగా.. ఆయన తప్పుకోవడంతో అరుణ్ విజయ్ కు వెళ్లింది. సూర్య తప్పుకున్న తర్వాత, నటి మమితా బైజు కూడా తప్పుకున్నారు. ఈ క్రమంలోనే పలు రూమర్లు పుట్టుకొచ్చాయి. ఎట్టకేళలకు మమితా క్లారిటీ ఇవ్వడంతో అన్నింటికీ చెక్ పడింది. ఇక మమితా రీసెంట్ గా ‘ప్రేమలు’ Premalu చిత్రంతో మంచి గుర్తింపు పొందింది.

PREV
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?