బెంగుళూరు ప్రైవేట్ పార్టీలో ఎన్టీఆర్ సందడి... పక్కనే క్రేజీ ఫెలోస్!

Published : Mar 02, 2024, 09:33 AM IST
బెంగుళూరు ప్రైవేట్ పార్టీలో ఎన్టీఆర్ సందడి... పక్కనే క్రేజీ ఫెలోస్!

సారాంశం

ఎన్టీఆర్ బెంగుళూరులో సందడి చేశాడు. ఆయన కొందరు ప్రముఖులతో కలిసి ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

ఎన్టీఆర్ ఫుల్ బిజీ. ఏక కాలంలో దేవర, వార్ 2 చిత్రాలు పూర్తి చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర ఏప్రిల్ 5న విడుదల కావాల్సింది. షూటింగ్ పూర్తి కాని నేపథ్యంలో దసరాకు వాయిదా వేశారు. అక్టోబర్ 10న దేవర వరల్డ్ వైడ్ పలు భాషల్లో విడుదల కానుంది. అలాగే హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 టైటిల్ తో మల్టీస్టారర్ చేస్తున్నాడు. వార్ 2 స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. 

వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. కాగా ఎన్టీఆర్ నెక్స్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నాడు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. అసలు సలార్ కంటే ముందు ఎన్టీఆర్ తో చేయాల్సింది. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దాంతో ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యింది. కాగా నిన్న ఎన్టీఆర్ సతీసమేతంగా బెంగుళూరు వెళ్లారు. 

అక్కడ ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నారు. ఈ పార్టీలో ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి, కెజిఎఫ్ నిర్మాత విజయ్ కిర్గన్దూర్, మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవి శంకర్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి, ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి సతీమణులు కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. 

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో బెంగుళూరులో జరిగిన ఈ పార్టీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రేజీ ఫెలోస్ అందరూ ఒక చోట చేరినట్లు అయ్యింది... 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?