ఎన్టీఆర్ డైలాగ్ గుర్తుకు వచ్చేలా సంఘటన.. మోడల్ కు తీవ్ర గాయాలు!

pratap reddy   | Asianet News
Published : Aug 26, 2021, 07:24 PM IST
ఎన్టీఆర్ డైలాగ్ గుర్తుకు వచ్చేలా సంఘటన.. మోడల్ కు తీవ్ర గాయాలు!

సారాంశం

ఎన్టీఆర్ డైలాగ్ గుర్తుకు వచ్చేలా ఓ సంఘటన  జరిగింది. జర్మనీకి చెందిన ప్రముఖ మోడల్ జెసికా లిడోల్ఫ్ తీవ్ర గాయాలపాలైంది.

'పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూస్కో.. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు ట్రై చేయొచ్చు.. చనువిచ్చింది కదా అని ఆడుకోవాలని ట్రై చేస్తే వేటాడేస్తది' అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ థియేటర్స్ లో మోత మోగించింది. యమదొంగ చిత్రంలోనిది ఈ డైలాగ్. 

ఎన్టీఆర్ డైలాగ్ గుర్తుకు వచ్చేలా ఓ సంఘటన  జరిగింది. జర్మనీకి చెందిన ప్రముఖ మోడల్ జెసికా లిడోల్ఫ్ తీవ్ర గాయాలపాలైంది. మోడల్స్ అన్నాక ఫోటో షూట్స్ సహజం. హాట్ గా కనిపించే మోడల్స్ వైవిధ్యం కోసం వివిధ లొకేషన్స్ లో ఫోటో షూట్స్ చేస్తుంటారు. 

ప్రమాదకర ప్రదేశాల్లో కూడా ఫోటోషూట్స్ జరుగుతుంటాయి. కాకపోతే తగు జాగ్రత్తలు పాటిస్తారు. జెసికా పులి బోను వద్ద ఫోటో షూట్స్ కు ప్రయత్నించిందట. దీనితో రెండు చిరుత పులులు ఒక్కరిగా ఆమెపై దాడి చేసినట్లు హాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. జెసికా ముఖానికి, తలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ప్రాణాపాయం లేదు. 

తలకు గాయం కావడంతో వైద్యులు విజయవంతంగా సర్జరీ చేశారట. చిరుతలు దాడి చేసిన తర్వాత ఆమెని హెలికాఫ్టర్ సాయంతో ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. జంతువులను ప్రదర్శించే రిటైర్మెంట్ హోమ్ లో ఈ సంఘటన జరిగింది. దీనితో జర్మనీ పోలీసులు ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

Maa Vande: మోదీ బయోపిక్‌ `మా వందే` బడ్జెట్‌ తెలిస్తే మతిపోవాల్సిందే.. వామ్మో ఇది హాలీవుడ్‌ రేంజ్‌
Anchor Rashmi: కల్చర్‌ మన బట్టల వద్దే ఆగిపోయింది.. రష్మి గౌతమ్‌ క్రేజీ కౌంటర్‌.. కుక్కల సమస్యపై ఆవేదన