RC15: శంకర్, రాంచరణ్ మూవీ కథకు భారీ హంగులు.. రంగంలోకి రజిని డైరెక్టర్

Published : Aug 26, 2021, 06:31 PM IST
RC15: శంకర్, రాంచరణ్ మూవీ కథకు భారీ హంగులు.. రంగంలోకి రజిని డైరెక్టర్

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా బిగ్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ కాంబోలో భారీ చిత్రానికి రంగం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా బిగ్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ కాంబోలో భారీ చిత్రానికి రంగం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రం గురించి అందుతున్న అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని పెంచేస్తున్నాయి. శంకర్ ఈసారి సాదాసీదాగా కాకుండా భారీ లెవల్ లో కథపై ఫోకస్ పెడుతున్నారు. కనీవినీ ఎరుగని విధంగా పొలిటికల్ అంశాలు కథకు జోడిస్తూనే.. కమర్షియల్ హంగులు కూడా అద్దుతున్నారు. 

తాజాగా ఈ చిత్రం కోసం క్రేజీ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. శంకర్ కు కథ విషయంలో సాయం చేసేందుకు, ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు కార్తీక్ సుబ్బరాజ్ కథలో ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో పేట చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా ఈ చిత్రం కోసం సౌత్ ఇండియా నుంచి ప్రముఖ నటీనటులు శంకర్ ఎంపిక చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళీ నటుడు జయరాం ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నారట. హీరోయిన్ అంజలి మరో కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

రాంచరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ రీసెంట్ గానే పూర్తయింది. సెప్టెంబర్ నుంచి శంకర్, చరణ్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 రెండో వారం ఎలిమినేషన్‌.. కృష్ణుడు ఔట్‌ ?
Soundarya: సౌందర్య చనిపోయిందని నమ్మలేక రెండేళ్లపాటు అభిమానులు చేసిన పని ఇదే.. అమ్మ బయటపెట్టిన నిజం