72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ప్రపంచ సుందరీమణులు మన తెలంగాణకు చెందిన తాటికల్లు, తాటి ముంజలు తినడం విశేషం.
72వ మిస్ వరల్డ్ అందాల పోటీలకు హైదరాబాద్ వేదికైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ఈవెంట్ శనివారం రాత్రి(మే 10) గ్రాండ్‌గా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ అందాల పోటీలను ప్రారంభించారు. 110కి పైగా దేశాల సుందరీమణులు మిస్ వరల్డ్ కిరీటం కోసం పోటీపడుతున్నారు. దాదాపు 22 రోజులపాటు ఈ పోటీలు జరగబోతున్నాయి.
మన భారత్ నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తుంది. గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ అందాల పోటీల్లో రోజు రోజుకి ఫిల్టర్ జరుగుతుంది. ఒక్కో దశలో కొంత మంది ఎలిమినేట్ అవుతారు. ఫైనల్‌గా ముగ్గురు మిగులుతారు. గ్రాండ్ ఫైనల్ మే 31న జరగనుంది. ఫైనల్‌గా ముగ్గురు విన్నర్స్ అవుతారు. వారిలో ఒకరు మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్‌గా నిలుస్తారు. మిగిలిన ఇద్దరు ఫస్ట్ రన్నరప్, సెకండ్ రన్నరప్‌గా నిలుస్తారు.
మరి ఈ ఏడాది ఈ అందాల కిరీటం ఎవరికి దక్కుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. గతేడాది ముంబయిలో ఈ వేడుకలు జరగ్గా క్రిస్టినా పిస్కోవా విన్నర్‌గా నిలిచారు. మరి ఈ సారైనా మన ఇండియా అందగత్తె విన్నర్‌గా నిలుస్తుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే తాజాగా సుందరీమణులు హైదరాబాద్‌లో సందడి చేశారు. తెలంగాణ ఫుడ్‌ని ఆస్వాధించారు. అంతేకాదు కల్లు తాగుతూ కనిపించారు. తెలంగాణలో సహజంగా దొరికే నీరా(కల్లు)ని ప్రపంచ అందాల భామలు సేవించారు.
వారంతా కల్లు టేస్ట్ ని ఆస్వాధించడం విశేషం. కల్లు మాత్రమే కాదు, తాటి ముంజలు కూడా సేవించారు. తాటి కమ్మలో తీసుకొచ్చిన ముంజలను ఎంతో టేస్టీగా తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే ఈ అందాల పోటీల్లో తెలంగాణ సాంప్రదాయానికి పెద్ద పీఠ వేయాలని ప్రభుత్వం భావించిందట. సుందరీమణులు తెలంగాణ చేనేత వస్త్రాలను ధరించే ఏర్పాట్లు కూడా చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.