200కోట్ల క్లబ్‌లో మోహన్‌ లాల్‌ మూవీ.. సరికొత్త రికార్డు దిశగా పరుగులు

Google News Follow Us

సారాంశం

మలయాళ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తున్నాయి. ఇటీవల `లూసిఫర్‌ 2`(ఎల్‌2ః ఎంపురాన్‌`తో పెద్ద హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు `తుడరుమ్‌`తో సంచలనాలు క్రియేట్‌ చేస్తున్నారు. 

మోహన్‌లాల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `తుడరుమ్` రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మోహన్‌లాల్ ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. తరుణ్ మూర్తి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా కేవలం 17 రోజుల్లోనే ఈ మైలురాయిని అందుకుంది. వరుసగా రెండోసారి మోహన్‌లాల్ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌లోకి రావడం విశేషం. ఇంతకు ముందు `ఎంపురాన్` సినిమా కూడా 200 కోట్లు వసూలు చేసింది. 

`తుడరుమ్‌` సక్సెస్‌ పై మోహన్‌ లాల్‌ ఎమోషనల్‌ నోట్‌

 "కొన్ని ప్రయాణాలకి హడావిడి అక్కర్లేదు, ముందుకు తీసుకెళ్లాలనే మనసు చాలు. కేరళలోని అన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాల్లో `తుడరుమ్` తన స్థానాన్ని సంపాదించుకుంది. అందరి ప్రేమకీ ధన్యవాదాలు", అంటూ 200 కోట్ల సంతోషాన్ని మోహన్‌లాల్ షేర్ చేసుకున్నారు. 

15ఏళ్ల తర్వాత శోభన, మోహన్‌ లాల్‌ జోడీగా `తుడరుమ్‌`

అనౌన్స్ చేసినప్పటి నుంచీ `తుడరుమ్` సినిమాపై అందరి దృష్టి ఉంది. ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న `సౌదీ వెళ్లక్క` సినిమా తర్వాత తరుణ్ మూర్తి డైరెక్షన్‌లో మోహన్‌లాల్ నటిస్తున్న సినిమా కావడం దీనికి ఒక కారణం. 15 ఏళ్ల తర్వాత మోహన్‌లాల్- శోభన కాంబినేషన్ రావడం కూడా మరో కారణం. ఎన్నో ఎదురుచూపుల తర్వాత ఏప్రిల్ 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాని చూసిన ఫ్యాన్స్ అంతా "మా పాత లాలేట్టన్ తిరిగొచ్చాడు" అని అన్నారు. 

ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. మంచి మౌత్ పబ్లిసిటీతో పాటు, ఫస్ట్ డే ఇండియా నెట్ కలెక్షన్ 5.25 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత కూడా కలెక్షన్ల వేట కొనసాగించి, పది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఇప్పటివరకు కేరళలో 90.35 కోట్లు వసూలు చేసింది `తుడరుమ్`. కె.ఆర్. సునీల్, తరుణ్ మూర్తి కలిసి రాసిన ఈ సినిమాలో మోహన్‌లాల్ శణ్ముఖన్ అనే పాత్రలో నటించారు. 

మోహన్‌లాల్, శోభనతో పాటు ఫర్హాన్ ఫాజిల్, మణియన్ పిళ్ల రాజు, బిను పప్పు, నందు, ఇర్షాద్, ఆర్ష చాందిని బైజు, థామస్ మాథ్యూ, కృష్ణ ప్రభ, ప్రకాష్ వర్మ, అరవింద్ వంటి చాలా మంది నటించారు. రజపుత్ర బ్యానర్‌పై ఎం. రంజిత్ ఈ సినిమాని నిర్మించారు. 

 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on