గుప్పెడంత మనసు దేవయానికి గంపెడు కష్టం, వ్యక్తి చేతిలో మోసపోయిన మిర్చి మాధవి

Published : Mar 05, 2023, 08:36 AM ISTUpdated : Mar 05, 2023, 08:45 AM IST
గుప్పెడంత మనసు దేవయానికి గంపెడు కష్టం, వ్యక్తి చేతిలో  మోసపోయిన మిర్చి మాధవి

సారాంశం

సైబర్ నేరాలకు సామాన్యులతో పాటు... సెలబ్రిటీలు కూడా బోల్తా పడుతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు.  ఈమధ్య కాలంలో ఈ నేరాలు ఎక్కువైపోయాయి. ఈక్రమంలో.. తెలిసినవారి చేతిలోనే మోసపోయింది ప్రముఖ టెలివిజన్ యాక్ట్రస్ మిర్చి మాధవి. వివరాల్లోకి వెళ్తే.. 

మిర్చి మాధవిగా ఫేమస్ అయిన నటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కుమిర్చి మాధవి అన్న పేరు ఉన్నా.. పెద్దగా గుర్తు పట్టరు కాని. గుప్పెడంత మనసు పెద్దమ్మ, లేక రిషి సార్ పెద్దమ్మ, లేక దేవయాని పెద్దమ్మలాంటి పేర్లుమాత్రం ఆడియన్స్ లో బాగా నాటుకుపోయాయి. సూపర్ హిట్ టెలివిజన్ సీరియల్ గుప్పడంత మనసులో దేవయాని పెద్దమ్మగా.. నెగెటీవ్ రోట్ లో అద్భుతంగా పండించింది మాధవి. హీరో హీరోయిన్లకుఎంత క్రేజ్ ఉందో.. ఈసిరియల్ లో దేవయాని పాత్రకు అంత క్రేజ్ ఉంది.ఒక రకంగా సీరియల్ మొత్తాన్ని నడిపించేది ఈక్యారెక్టర్టరే. తన కుట్రలతో సీరియల్ ను మలుపులు తిప్పుతూ ఉంటుంది దేవయాని పాత్ర. 

ఇక ఈ సీరియల్ ద్వారా ఫేమస్ అయిన మిర్చి మాధివి. సీరియల్స్ లో ఎంత మందినిమోసం చేసి.. కుట్రలుకుంతత్రాలుపన్నినా.. నిజ జీవితంలో మాత్రం ఓ వ్యాక్తి చేతిలోమోసపోయింది. ఆర్థికంగా పెద్ద మొత్తంలో కోల్పోయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్ అంటూ..ఓ వ్యక్తి చెప్పడంతో 5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టానని, కాని అతను ఆ డబ్బు కాజేసి తనను మోసం చేశాడంటూ మాధవి వాపోయింది. 

అయితే డబ్బు పోతే పోయింది. కాని తనునమ్మిన వ్యక్తి. తనకు బాగా తెలిసిన వ్యక్తి ఇలా తనను మోసం చేయడం బాధగా ఉంది అంటుంది మాధవి. స్టాక్‌ మార్కెట్ గురించి తనకి సరిగా అవగాహన లేకపోవడంతో.. ఆ వ్యక్తి తనను ఎంతో సులువుగా మోసం చేశాడని చెప్పుకొచ్చింది. అంతే కాదు ఇతరులను గుడ్డిగా నమ్మి డబ్బులు ఇవ్వొద్దు. మరీ ముఖ్యంగా స్ట్రాక్ మార్కెట్ గురించి తెలియకుండా అస్సలు వాటిపై ఇన్వెస్ట్ చేయొద్దు అంటూ... తనకు జరిగిన పరిస్థితిని వివరిస్తూ.. ఆడియన్స్ కు జాగ్రత్తలు చెపుతోంది మాధవి. 

ఇక  ఈమధ్యే గుప్పెడంత మనసు సీరియల్ నుంచి తప్పుకుంది మాధవి. తన ఫ్యామిలీయూకేలో సెటిల్ అవ్వడంతో... ఆమె కూడా అక్కడికే వెళ్ళిపోతుంది. దాంతో ఈసీరియల్ ను వదలుకోక తప్పడం లేదు అంటోంది. గుప్పెడంత మనసు సీరియల్‌లో మిర్చి మాధవి ప్లేస్‌లో సంగీత కొండవీటి అనే మరో  సీనియర్ నటిని తీసుకున్నారు. కాని దేవయాని పాత్రలో మాధవిని చూసిన ఆడియన్స్ ఇంకెవరిని అందులో యాక్సప్ట్ చేయలేకపోతున్నారు. మళ్శీ మిర్చ్ మాధవినే ఈ పాత్రలోకి రావాలంటూ కోరుకుంటున్నారు. కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఇక మిర్చి మాధవి.. గుప్పెడంత మనసు తో పాటు.. చాలా సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలానే సిల్వర్‌ స్క్రీన్‌ మీద కూడా అనేక సినిమాల్లో నటించింది. మరీ ముఖ్యంగా ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మిర్చిలో ఆమె పాత్రకు మంచి మార్కులు పడటమే కాక.. మిర్చి మాధవిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత.. ఆమె 100 % లవ్, శతమానం భవతి, గద్దలకొండ గణేష్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. 

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం