అసిస్టెంట్‌తో చెప్పులు విప్పించుకున్న హీరోయిన్, భూమీ ఫెడ్నేకర్ పై మండిపడుతున్న నెటిజన్లు

Published : Mar 05, 2023, 08:00 AM ISTUpdated : Mar 05, 2023, 08:03 AM IST
అసిస్టెంట్‌తో చెప్పులు విప్పించుకున్న హీరోయిన్, భూమీ ఫెడ్నేకర్ పై మండిపడుతున్న నెటిజన్లు

సారాంశం

బాలీవుడ్ నుంచి స్టార్స్ ఎప్పుడూ ఏదోఒక వివాదంలో చిక్కకుంటూనే ఉంటారు. కాని ఇప్పటి వరకూ ఎప్పుడూ.. వివాదాలకు తన కెరీర్ లో ప్లైస్ ఇవ్వని హీరోయిన్ భూమీ ఫెడ్రేకర్. ఇక ఆమె కూడా రీసెంట్ గా ఓవివాదంలో చిక్కుకున్నారు. 

బాలీవుడ్ లో తన సినిమాలు తాను చేసుకుంటూ.. కామ్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది భూమి ఫెడ్నేకర్‌. వరుసగా సినిమాలు చేస్తూ  ఆడియాన్స్ ను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లో మంచి మంచి సినిమాలు చేసుకుంటూ.. సక్సెస్‌ఫుల్ లైఫ్ ను లీడ్ చేస్తోంది. అంతే కాదు బీ టౌన్ లో  ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా అనుష్క నటించిన  భాగమతి సినిమాను  హిందీలో రీమేక్ చేసి... అద్భఉతమైన నటనతో మెప్పించింది చిన్నది. 

అయితే ఇప్పటి వరకూ బాలీవుడ్ లో ఎన్నో వివాదాలు ఎదురయ్యాయి. దాదాపు అందరు నటీనటులు ఏదో ఒక వివాదంతో ఇబ్బందులు పడ్డారు. కాని ఇప్పటి వరకూ ఎలాంటి వివాదాలను తన దగ్గరకు రానివ్వని ఈ బ్యూటీ.. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరుకావడంతో ఆమె ఓ వివాదంలో చిక్కుకుంది.

భూమి ఫెడ్నేకర్‌ రీసెంట్ గా ముంబయ్ లో  ఓ ఈవెంట్‌కు గెస్టుగా వెళ్లింది. అక్కడ జ్యోతి ప్రజ్వలన చేసేందుకు భూమి తన చెప్పులు స్టేజీ వద్ద తీసేందుకు ప్రయత్నించింది. కానీ..  ఆమె తన చెప్పులు  తీయలేకపోయింది. దీంతో తన అసిస్టెంట్‌ను పిలిచింది. అతడు ఆమె వద్దకు వచ్చి, చెప్పులు తీయడంలో సాయం చేశాడు. ఆ తర్వాత ఆమె స్టేజ్‌ పైకి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  ప్రస్తుతం ఫుల్ గా వైరల్ అవుతోంది.  అయితే ఈ విషయంలోనే ఆమె విమర్షలు కూడా ఎదుర్కొంటోంది.  అసిస్టెంట్‌తో చెప్పులు తీయించుకుంటావా  భూమిని నెట్టింట ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.

 

బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోన్న భూమీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది. SSMB28 లో భూమీ కూడా నటిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె టాలెంట్ ను బట్టీ.. సౌత్ లో వరుస ఆఫర్లు కొట్టేసి.. పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోవాలి అని చూస్తోంది భూమీ. మరి మహేష్ సినిమాలో ఆమె నటించడంపై ఎటువంటి అఫీఫషియల్ అనౌన్స్ మెంట్లు లేవు. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలి అంటే కొంత కాలం ఆగాల్సిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు