కొన్ని కాంబినేషన్లు అలా గుర్తుండిపోతాయి. ఎన్నేళ్ళైనా అలానిలిచిపోతాయి. అటువంటి కాంబోలలో వెంకటేష్, భూమిక జంట కూడా ఒకటి. మరి ఈ జంట కలిసి మళ్ళీ 20 ఏళ్ళ తరువాత సినిమా చేయబోతున్నారట.
ఎన్ని సినిమాలు చేశాము అన్నది ముఖ్యం కాదు. ఆ సినిమా ఎంతలా ప్రభావితం చేసింది అనేది ముఖ్యం. కలిసి పదుల సంఖ్యలో సినిమాలు చేయనవసరం లేదు. ఒక్క సినిమా చేసినా చాలు.. ఆసినిమా ఎవర్ గ్రీన్ అయితే.. ఈ కాంబినేషన్ లు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు ప్రేక్షకులు. ఈక్రమంలో అలానే టాలీవుడ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న జంటలలో వెంకటేష్-భూమిక జంట ఒకటి. వీరిద్దరూ కలిసి చేసింది ఒక్క సినిమానే అయినా.. వీరి జంటకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దాదాపు 20 సంవత్సరాల క్రితం.. 2002లో వెంకటేష్- భూమిక కలిసి వాసు సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కూడా అవ్వలేదు కాని యూత్ లో మాత్రం వాసు సినిమా బ్లాక్ బస్టర్ కంటే ఎక్కువే.
ఒక్క సినిమా అయినా ఫ్యాన్స్ లో ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. వాసు సినిమా విషయంలో కూడా.. అందు మెచ్చిన.. నచ్చిన అంశాలు చాలా ఉన్నాయి. అంత మంచి సినిమా హిట్ కాదు అంటే ఎలా నమ్మేది అని అనుకున్నావారు కూడా లేకపోలేదు.ఈక్రమంలో వీరి కాంబినేషన్ లో మరో సినిమా వచ్చి ఉంటే బాగుండేది అని చాలా మంది అప్పట్లోనే అనుకున్నారు. కాని అది అప్పుడు సాధ్యం కాలేదు.. దాదాపు 20 ఏళ్ల తరువాత ఈ కాంబినేషన్ కు ముహూర్తం కుదిరింది.
వీరి కాంబినేషన్ గురించి లేటెస్ట్ గా ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది. 20 ఏళ్ళ తర్వాత వెంకీ – భూమిక జంటగా ఆడియన్స్ కు కనిపించి కనువిందు చేయనున్నారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. వీరిద్దరు నటిస్తున్నారు కాని జంటగా సోలో సినిమాలో మాత్రం కాదు.. వేరే సినిమాలో.. వేరు వేరు పాత్రల్లో కనినపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆసినిమా ఏంటీ అంటే..
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ - పూజ హెగ్డే జంటగా కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను సల్మాన్ కు బాగా సెంటిమెంట్ అయిన రంజాన్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈసినిమాలో టాలీవుడ్ నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు నటించడం విశేషం.
ఈ సినిమాలో టాలీవుడ్ నుంచి వెంకటేష్, రానా, జగపతిబాబు కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నుండి రీసెంట్ గా మూవీ టీమ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. బిల్లీ బిల్లీ అంటూ కొత్త సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో సర్ప్రైజింగ్ గా వెంకటేష్ భూమికా కనిపించారు. వీరిద్దరూ జంటగా స్టెప్పులు వేస్తూ కనిపించారు. దీంతో వెంకీ – భూమిక వేసిన డ్యాన్సులు చూసి ఆడియన్స్ ఔరా అనుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత వీరు జంటగా కనిపించడంతో.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.