
ఈరెండేళ్లు సీనియర్ హీరో నటం సింహం బాలయ్యకు బాగ3 కలిసి వచ్చింది. ఆయన సినిమాలు వరుసగా సూపర్ హిట్లు అందుకున్నాయి. అంతే కాదు 100 కోట్ల మార్క్ ను కూడా బాలయ్య అందుకున్నారు. 2023లో వరుస హిట్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు నందమూరి నట సింహం.అంతే కాదు సినిమాల విషయంలో కూడా ఆయన ఆచితూచి అడుగులు వేశాడు.
మెగాస్టార్ వరుస ఫెయిల్యూర్స్ చూస్తే.. బాలయ్య మాత్రంవరుస హిట్లు కొట్టాడు. ఇక ముందు కూడాఇలానే హిట్లు కొట్టాలని పట్టుదలతో పనిచేస్తున్నాడు నందమూరి నటసింహం. ఇప్పటికే వరుస సినిమాలులైన్ లో పెట్టాడు బాలయ్య. అందులో ప్రస్తుతం ఆయన 109వ సినిమా చేస్తున్నాడు. మెగా హీరోలతో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న బాబీతో బాలయ్య మాస్ సినిమాచేస్తున్నాడు. ఈమూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈమూవీ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వైరల్ అవుతూ వస్తున్నాయి.
దావూద్ ఇబ్రహీం పిచ్చిగా ప్రేమించిన బాలీవుడ్ హీరోయిన్, ఇప్పుడేం చేస్తోందో తెలుసా..?
ఈఏడాది మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేసి హిట్ కొట్టాడు బాబీ. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ అందుకున్నాడు ప్రస్తుతం బాలయ్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈమూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి.. సూపర్ ఫాస్ట్ గా సాగుతోంది. ఇక ఈమూవీకి సబంధించి ఏదొ ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.బాబీ తీసే ప్రతీ సినిమాలలో ఒక ప్రత్యేక ఐటమ్ సాంగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.
బాబీ గతంలో ఎన్టీఆర్‌తో జై లవకుశ సినిమా చేయగా.. ఈ మూవీలో స్వింగ్ జర ఐటమ్ సాంగ్ ఒక రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అయ్యింది. దీని తర్వాత రీసెంట్‌గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే తాజాగా వస్తున్న ఎన్బీకే 109 సినిమాలో కూడా బాబీ ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ తమన్నాను సంప్రదించినట్లు టాక్.
బిగ్ బాస్‌ను బ్యాన్ చేయాల్సిందే... పట్టు పడుతున్న ప్రముఖ పొలిటికల్ లీడర్....?
దీనిపై తమన్నా కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. సితార బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, ఎస్.సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే ఈ మూవీలో మలయాళ స్టార్ దుల్కర్ కూడా నటిస్తున్నట్టు సమాచారం. అయితే నట సింహం బాలకృష్ణతో దుల్కర్ సల్మాన్ కలిసి వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.