#Salaar టిక్కెట్ కావాలా..అయితే వెళ్లి లైన్లో నిలబడు

Published : Dec 19, 2023, 02:20 PM IST
 #Salaar టిక్కెట్ కావాలా..అయితే వెళ్లి  లైన్లో నిలబడు

సారాంశం

టిక్కెట్ల కోసం థియేటర్స్ దగ్గర లైన్లో నిలబడటం ఓ కిక్ గా భావించేవారు అభిమానులు. తమ అభిమాన హీరో టిక్కెట్ ఓ గంట సేపు లైన్ లో నిలబడి, ఆ సినిమా కబుర్లు చెప్పుకుంటూ తీసుకుంటే లాటరి కొట్టినంత ఫీలింగ్. 


 ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకులు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సలార్’ . ‘కె.జి.ఎఫ్'(సిరీస్) దర్శకుడు ప్రశాంత్ నీల్..  ప్రభాస్ తో చేసిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 22న ‘సలార్’ మొదటి భాగం ‘సలార్ పార్ట్ 1 : సీజ్ ఫైర్’ పేరుతో తెలుగు, కన్నడంతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో టిక్కెట్ల అమ్మకాల విషయంలో నైజాం డిస్ట్రిబ్యూటర్స్  తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

                               గతంలో పెద్ద సినిమా రిలీజ్ అనగానే టిక్కెట్ల కోసం జనం థియేటర్స్ దగ్గర రెండు రోజుల ముందు నుంచే బారులు తీరేవారు. అయితే ఆన్ లైన్ బుక్సింగ్స్ వచ్చాక ఆ సీన్ కనపడటం లేదు. ఓ రకంగా టిక్కెట్ల కోసం థియేటర్స్ దగ్గర లైన్లో నిలబడటం ఓ కిక్ గా భావించేవారు అభిమానులు. తమ అభిమాన హీరో టిక్కెట్ ఓ గంట సేపు లైన్ లో నిలబడి, ఆ సినిమా కబుర్లు చెప్పుకుంటూ తీసుకుంటే లాటరి కొట్టినంత ఫీలింగ్. అయితే ఆన్ లైన్ బుక్కింగ్ ఆ రోజులను మాయం చేసేసాయి. అయితే మైత్రీ వారు మాత్రం ఆ రోజులను రీక్రియేట్ చేయాలనుకున్నారు. నైజాం ఏరియాలో డైరక్ట్ గా థియేటర్ కు వెళ్లి టిక్కెట్ కొనుక్కునేలా ప్లాన్ చేసారు. దాంతో థియేటర్స్ దగ్గర సినిమా సందడి రెండు రోజుల ముందు నుంచి మొదలు అవుతోంది. 

                              ఈ  విషయాన్ని అఫీషియల్ గా తెలియచేస్తూ ‘సలార్’ ఆన్లైన్ బుకింగ్స్ ఉండవని,. థియేటర్ కి వెళ్లి కౌంటర్ల వద్ద లైన్లో నిలబడే టికెట్లు తీసుకోవాలని ‘మైత్రి’ సంస్థ ఓ ట్వీట్ వేసింది. ఒకప్పుడు కొత్త సినిమాలకి టికెట్ల కోసం జనాలు థియేటర్ వద్ద ఎలా నిలబడి కష్టపడేవారో ఆ రోజులను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం ఇది అని .. ఆ ట్వీట్లో ఉంది. అయితే ఆన్ లైన్ టిక్కెట్ కౌంటర్ ఓపెన్ చేస్తారు అన ఎదురుచూస్తున్న వారికి ఇది పెద్ద షాకే.  తాము పనిగట్టుకుని, శెలవు పెట్టుకుని మరీ లైన లో నిలబడి టిక్కెట్ ఎక్కడ తీసుకోగలం, అయినా ‘సలార్’ వంటి పెద్ద సినిమాకి ఆన్లైన్ బుకింగ్స్ లేకపోవడం ఏంటి.. అంటూ ‘మైత్రి’ సంస్థని విమర్శిస్తున్నారు కొందరు నెటిజన్లు.   
 
సలార్ మూవీ డిసెంబర్ 22న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.  బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే సలార్ అని డైెరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పేశారు. సలార్ సినిమాకు ఫ్రెండ్‍షిప్ ముఖ్యమైన ఎమోషన్ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “శత్రువుగా మారిన ఇద్దరు స్నేహితుల కథే సలార్. సలార్‌లో ఫ్రెండ్‍షిప్ కోర్ ఎమోషన్. సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్‌లో సగం కథే చెబుతాం. సలార్ మొత్తం కథను రెండు సినిమాలుగా చూపిస్తాం. మేం సృష్టించిన ప్రపంచాన్ని ట్రైలర్లో ప్రేక్షకులు చూస్తారు” అని ప్రశాంత్ నీల్ చెప్పారు.  
 
బాహుబలి తర్వాత వచ్చిన ప్రభాస్ సినిమాలు  తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినా క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు కారణం ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. అలాగే ఆయన క్రేజీ కాంబినేషన్స్.  ఈ క్రమంలో ఈ డిసెంబర్ లో రాబోతున్న ప్రభాస్ సలార్ సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్నాయి.   ఈ సినిమాకి కేజీఎఫ్ దర్శకులు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడంతో, ఖచ్చితంగా ఈ చిత్రం తప్పకుండా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అవుతుంది అని నమ్మకంతో ఉంది ట్రేడ్.   ఈ సినిమా షారుక్ ఖాన్ దుంకి సినిమాతో పోటీ పడాల్సి ఉన్నా కూడా లెక్క చేయటం లేదు. 

సలార్‌గా ప్రభాస్, విలన్ వరదరాజ్ మన్నార్‌గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ కాగా.. జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రీయా రెడ్డి, రామచంద్ర రాజు కీలకపాత్రలు పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు