మహర్షి రిలీజ్ తర్వాత మహేష్ తొలిసారి.. నా కెరీర్ లో బిగ్గెస్ట్ అంటూ!

Published : May 11, 2019, 08:09 AM IST
మహర్షి రిలీజ్ తర్వాత మహేష్ తొలిసారి.. నా కెరీర్ లో బిగ్గెస్ట్ అంటూ!

సారాంశం

మహర్షి చిత్రం విడుదలయ్యాక మహేష్ తొలిసారి స్పందించాడు. ట్విట్టర్ వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోంది. మహర్షి చిత్రం మహేష్ కెరీర్ లోనే అత్యధికంగా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. మహేష్ బాబు మూడు లుక్స్ లో కనిపిస్తూ ఎమోషనల్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడని ప్రశంసలు దక్కుతున్నాయి. 

మహర్షి చిత్రం విడుదలయ్యాక మహేష్ తొలిసారి స్పందించాడు. ట్విట్టర్ వేదికగా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇప్పటివరకు నా జర్నీ చాలా ప్రత్యేకమైనది. నా 25వ చిత్రాన్ని బిగ్గెస్ట్ హిట్ చేసినందుకు కృతజ్ఞతలు. అభిమానుల నుంచి, ఆడియన్స్ నుంచి మహర్షి చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని మహేష్ తెలిపాడు. 

ఇంతటి ఘనవిజయానికి కారణమైన మహర్షి చిత్ర యూనిట్ కు, దర్శకుడు వంశీ పైడిపల్లికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. వేసవి సెలవులు కావడం, మరే స్టార్ హీరో సినిమా లేకపోవడం మహర్షి చిత్రానికి కలసి వచ్చే అంశం. మహర్షి చిత్రం ఎంత పెద్ద విజయంగా నిలవనుంది అనేది వీకెండ్ వసూళ్ళని బట్టి తేలనుంది. మహేష్ సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. 

PREV
click me!

Recommended Stories

AOR Movie Review: అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ.. నవీన్‌ పొలిశెట్టి నవ్వించాడా?
దళపతి విజయ్ అభిమానులకు సుధా కొంగర వార్నింగ్, పరాశక్తి పై నెెగెటీవ్ ప్రచారం జరుగుతుందా?