ఇదేం ట్విస్ట్ మారుతి.. తేజు కోసం ఎలాంటి కథో తెలుసా!

Published : May 10, 2019, 09:03 PM IST
ఇదేం ట్విస్ట్ మారుతి.. తేజు కోసం ఎలాంటి కథో తెలుసా!

సారాంశం

వరుస 6 పరాజయాల తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ విజయాల బాట పట్టాడు. తేజు చివరగా నటించిన చిత్రలహరి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. చిత్రలహరి అందించిన ఉత్సాహంతో సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రాలకు సిద్ధం అవుతున్నాడు. 

వరుస 6 పరాజయాల తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ విజయాల బాట పట్టాడు. తేజు చివరగా నటించిన చిత్రలహరి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. చిత్రలహరి అందించిన ఉత్సాహంతో సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రాలకు సిద్ధం అవుతున్నాడు. ఇకపై కథల ఎంపిక విషయంలో పక్కాగా ఉండాలిని సాయిధరమ్ తేజ్ భావిస్తున్నాడు. 

సాయిధరమ్ తేజ్ తదుపరి చిత్రం మారుతి దర్శకత్వంలో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ ఖాయం అయినట్లు తాజా సమాచారం. మారుతి తన చిత్రాల్లో హాస్యానికి పెద్దపీట వేస్తారు. కానీ ఊహించని విధంగా మారుతి సాయిధరమ్ తేజ్ కోసం ఓ ఎమోషనల్ కథని సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఈ చిత్రం తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మారుతి ఈ చిత్రంలో హృదయాన్ని హత్తుకునే సన్నివేశాల్ని రాశారట. తేజు తండ్రి పాత్రలో రావు రమేష్ ఎంపికైనట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?