విశాల్ పెళ్ళికి ముహూర్తం ఫిక్స్.. అదొక్కటే సస్పెన్స్!

By Prashanth MFirst Published May 10, 2019, 8:30 PM IST
Highlights

హీరో విశాల్ తరుచుగా వార్తల్లో ఉండే వ్యక్తి. సినిమాల పరంగా, తమిళ చిత్రపరిశ్రమకు సంబంధించిన వ్యవహారాల పరంగా విశాల్ ఎప్పుడూ వార్తలో నిలుస్తూ ఉంటాడు. తమిళ నిర్మాతల మండలి చైర్మన్ గా విశాల్ పలు విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

హీరో విశాల్ తరుచుగా వార్తల్లో ఉండే వ్యక్తి. సినిమాల పరంగా, తమిళ చిత్రపరిశ్రమకు సంబంధించిన వ్యవహారాల పరంగా విశాల్ ఎప్పుడూ వార్తలో నిలుస్తూ ఉంటాడు. తమిళ నిర్మాతల మండలి చైర్మన్ గా విశాల్ పలు విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇక విశాల్ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. విశాల్ నటించిన టెంపర్ రీమేక్ చిత్రం అయోగ్య త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. 

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అనీషా రెడ్డితో విశాల్ నిశ్చితార్థం జరిగింది. ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల అంగీకారంతో వివాహానికి సిద్ధం అవుతున్నారు. నిశ్చితార్థం హైదరాబాద్ లోనే జరిగింది. కేవలం కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది. వివాహానికి సంబంధించిన వివరాలని కూడా కుటుంబసభ్యులు గోప్యంగా ఉంచారు. 

విశాల్, అనీషా వివాహం జరగబోయే తేదీ బయటకు వచ్చింది. అక్టోబర్ 9 ఈ వీరిద్దరో వివాహం ఘనంగా జరగనుందట. వివాహవేడుక హైదరాబాద్ లో జరుగుతుందా లేక చెన్నైలో జరుగుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలో విశాల్ తన వివాహం గురించి అధికారికంగా వివరాలు వెల్లడించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

 

 

 

click me!