జూ.ఎన్టీఆర్ గురించి నేను మాట్లాడలేదు!

Published : Jun 27, 2019, 06:11 PM IST
జూ.ఎన్టీఆర్ గురించి నేను మాట్లాడలేదు!

సారాంశం

దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాజ్ దూత్. కార్తీక్ అర్జున్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రాజ్ దూత్. కార్తీక్ అర్జున్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం గురించి మేఘాంశ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనని హీరోగా చూడడం నాన్న కల. ఆయన ఉండుంటే బావుండేది అని మేఘాంశ్ తెలిపాడు. 

నాన్న ఉండుంటే నటనలో నాకు గైడెన్స్ ఇచ్చేవారు అని మేఘాంశ్ తెలిపాడు. నాన్న దూరమైన తర్వాత అమ్మ తరుపున వాళ్ళు, నాన్న తరపున వాళ్ళు అన్ని చూసుకున్నారని మేఘాంశ్ తెలిపాడు. ఇక తాను జూ. ఎన్టీఆర్ గురించి మాట్లాడినట్లు వచ్చిన వార్తలపై మేఘాంశ్ స్పందించాడు. జూ. ఎన్టీఆర్ తమకు సాయం చేశాడని తాను చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. 

ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మేఘాంశ్ తెలిపాడు. నేను ఏమీ మాట్లాడకుండానే ఆ వార్తలు ఎలా వచ్చాయో తెలియడం లేదని మేఘాంశ్ క్లారిటీ ఇచ్చాడు. తాను అభిమానించే నటుల్లో ఎన్టీఆర్ కూడా ఒకరు. త్వరలో రాజ్ దూత్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా