డైరెక్టర్ కలర్ పై ట్రోలింగ్.. తిప్పికొట్టిన ఫ్యాన్స్!

Published : Apr 10, 2019, 03:17 PM IST
డైరెక్టర్ కలర్ పై ట్రోలింగ్.. తిప్పికొట్టిన ఫ్యాన్స్!

సారాంశం

తమిళంలో దర్శకుడు అట్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

తమిళంలో దర్శకుడు అట్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు తెలుగులో 'రాజా రాణి', 'మెర్సల్' పేరుతో విడుదలయ్యాయి. తెలుగులో కూడా అట్లీకి అభిమానులు ఉన్నారు.

రీసెంట్ గా ఆయన చెన్నైలో ఎంఏ చిదంబరం ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన చెన్నై-కోల్‌కతా ఐపీఎల్ మ్యాచ్ ని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో కలిసి వీక్షించారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన కొందరు సినీ అభిమానులు వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుందేమో అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. 

ఇది ఇలా ఉంటే మరికొందరు మాత్రం అట్లీ స్కిన్ కలర్ ని విమర్శిస్తూ మాట్లాడారు. అతడి కలర్ ని ట్రోల్ చేయడానికి ప్రయత్నించగా.. అట్లీ అభిమానులు రంగంలోకి దిగారు. ట్రోల్స్ చేస్తున్న వారిపై ఎదురుదాడి ప్రారంభించారు. అట్లీ రంగు మీద కామెంట్ చేయడం కాదూ.. అతడికున్న టాలెంట్ కామెంట్ చేసేవారికి ఉందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.

కష్టపడి ఎదిగిన అట్లీ.. షారుఖ్ పక్కన కూర్చొని మ్యాచ్ చూడగలుగుతున్నారు.. ఇంట్లో కూర్చొని కామెంట్స్ చేస్తోన్న మీరేం సాదించారంటూ మండిపడ్డారు  అభిమానులు. అట్లీ స్కిన్ కలర్ పై కామెంట్స్ చేసేవారు త్వరలోనే రియలైజ్ అవుతారని కామెంట్స్ పెడుతున్నారు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం