ప్రియుడితో నితిన్ హీరోయిన్ నిశ్చితార్థం, సర్ప్రైజ్ చేసిన యంగ్ బ్యూటీ.. వైరల్ ఫొటోస్

By tirumala AN  |  First Published Aug 23, 2024, 11:38 AM IST

గత కొన్ని రోజులుగా మేఘా ఆకాష్ పెళ్లి గురించి రూమర్స్ మొదలయ్యాయి. ఆ రూమర్స్ నిజం చేస్తూ గురువారం రోజు మేఘా ఆకాష్ తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. 


క్యూట్ గా కనిపించే యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ సక్సెస్ తో సంబంధం లేకుండా తెలుగు యువతకి బాగా నచ్చేసింది. కానీ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే సక్సెస్ చాలా ముఖ్యం. మేఘా ఆకాష్.. నితిన్ లై చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ కావడంతో మేఘా ఆకాష్ కి ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. 

అయితే గత కొన్ని రోజులుగా మేఘా ఆకాష్ పెళ్లి గురించి రూమర్స్ మొదలయ్యాయి. ఆ రూమర్స్ నిజం చేస్తూ గురువారం రోజు మేఘా ఆకాష్ తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. సాయి విష్ణు అనే కుర్రాడితో మేఘా ఆకాష్ నిశ్చితార్థం జరిగింది. వీళ్ళిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారట. అయితే సాయి విష్ణు బ్యాగ్రౌండ్ ఏంటి ? అతడు ఎవరు అనే విషయాలు ఇంకా బయటకి రాలేదు. 

Latest Videos

మేఘా ఆకాష్ నిశ్చితార్థం జరిగిన తర్వాత తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటూ ఫొటోస్ షేర్ చేసింది. సాయి విష్ణు, మేఘ ఆకాష్ ఈ ఫొటోస్ లో రొమాంటిక్ గా చూడ ముచ్చటగా ఉన్నారు. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Megha Akash (@meghaakash)

లై చిత్రం ఫ్లాప్ అయినా తర్వాత వెంటనే మరోసారి నితిన్ తో నటించే ఛాన్స్ అందుకుంది మేఘా ఆకాష్. చల్ మోహన్ రంగ చిత్రంలో మళ్ళీ నటించారు. ఆ మూవీ కూడా నిరాశపరిచింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఆమెకి అరకొర ఆఫర్స్ తప్ప చెప్పుకోదగ్గ చిత్రాలు లేవు. 

 

click me!