ప్రయివేట్ వ్యక్తి వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉపయోగిస్తుంటే తాము ఎలా బాధ్యులవుతామని వాదన వినిపించారు.
పదిహేనేళ్ల ఏళ్ల వయస్సులోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఇప్పటికి వెనక్కి తిరిగి చూసుకోకుండా కెరీర్‌లో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతోంది తమన్నా. ‘హ్యాపీడేస్’ చిత్రంతో మొదటి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి తమన్నా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇటు తెలుగు సినిమాలు.. అటు తమిళ సినిమాలు.. అడదపాదడపా హిందీ చిత్రాలు చేస్తూ కెరీర్‌ని విజయవంతంగా సాగిస్తోంది. ప్రభాస్, ఎన్‌టీఆర్, రామ్‌చరణ్, రవితేజ వంటి స్టార్లకి జోడీగా నటించి మంచి సక్సెస్ ను అందుకుంది.
ఈ క్రమంలో తమన్నా ఇటు సినిమాల్లో, అటు వెబ్ సిరీస్ లో, ఇంకా పలు కమర్షియల్ యాడ్స్ లో తీరిక లేకుండా బిజీగా ఉంటోంది. అయితే ఆమె చేసిన కొన్ని కమర్షియల్ యాడ్స్ ఎగ్రిమెంట్ ప్రకారం గడువు ముగిసినప్పటికీ వాటిని ఇంకా వినియోగించడంపై తమన్నా చెన్నై హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జీ సెంథిల్ కుమార్ రామమూర్తి తమన్న ప్రకటనలను ఆభరణాల కంపెనీలు వాడకుండా మధ్యంతర నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అయినప్పటికీ కొన్ని సంస్థలు గడువు తీరిపోయిన ప్రకటనలు ఇంకా ఉపయోగిస్తున్నారంటూ తమన్నా మళ్లీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి కోర్టు ధిక్కారణ పిటిషన్ వేసింది. ఈ కేసు న్యాయమూర్తులు సెంథిల్ కుమార్, రామమూర్తిల డివిజన్ బెంచ్ లో విచారణకు వచ్చింది. అయితే ఆ వాణిజ్య సంస్థ తరఫు న్యాయవాది ఆర్. కృష్ణ వాదిస్తూ తమన్న నటించిన ప్రకటనల ప్రాసారాన్ని తమ సంస్థ నిలిపేసిందని, కానీ ప్రయివేట్ వ్యక్తి వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఉపయోగిస్తుంటే తాము ఎలా బాధ్యులవుతామని వాదన వినిపించారు.
దాంతో న్యాయమూర్తులు ఈ కేసులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలన్నారు. అలాగే తదుపరి విచారణను సెప్టెంబర్ 12కి వాయిదా వేశారు. అంతేకాదు ఓ సబ్బు ప్రకటనపై కూడా తమన్నా కేసు వేయగా, సదరు సంస్థ తరఫు న్యాయవాదులు ఎవరూ హాజరు కాలేదు.