'సరిపోదా శనివారం' కథతో నారా లోకేష్ కి లింక్.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్ వైరల్

By tirumala AN  |  First Published Aug 23, 2024, 10:54 AM IST

నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ఈ చిత్రంపై మంచి పాజిటివ్ బజ్ ఉంది. టీజర్, ట్రైలర్ బాగా వర్కౌట్ అయ్యాయి.


నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ఈ చిత్రంపై మంచి పాజిటివ్ బజ్ ఉంది. టీజర్, ట్రైలర్ బాగా వర్కౌట్ అయ్యాయి. నాని పాత్రతో పాటు, విలన్ గా నటించిన ఎస్ జె సూర్య పాత్ర కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

నాని ప్రస్తుతం వరుస ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అంటే సుందరానికీ చిత్రం ఫ్లాప్ తర్వాత కూడా వివేక్ ఆత్రేయకి మరో ఛాన్స్ ఇచ్చారు నాని. అతడి ట్యాలెంట్ అందుకు కారణం అని నాని తెలిపారు. 

Latest Videos

ఓ ఇంటర్వ్యూలో నాని సరిపోదా శనివారం కథ గురించి చెబుతూ నారా లోకేష్ ప్రస్తావన వచ్చింది. సరిపోదా శనివారం కథకి, నారా లోకేష్ కి ఉన్న లింక్ ని నాని ఫన్నీగా తెలిపారు. చిత్ర గుప్తుడు, యముడు ఇద్దరూ ఒకే మనిషిలో ఉంటే ఎలా ఉంటుందో ఆ విధంగా నాని పాత్ర ఉంటుందని ఎస్ జె సూర్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీని గురించి యాంకర్ ప్రశ్నించగా.. నాని సమాధానం ఇచ్చారు. 

హీరోకి శనివారం మాత్రమే ఎందుకు కోపం వస్తుంది ? వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ఏంటి అనే అంశాలతో సినిమాలో మంచి కథ ఉందని నాని తెలిపారు. ఇందులో హీరో వారం మొత్తం తనకి కోపం తెప్పించిన వ్యక్తుల పేర్లని బుక్ లో రాసుకుంటాడు. శనివారం వచ్చేసరికి ఎవరి మీద కోపం తగ్గదో హీరో వాళ్ళ భరతం పడతాడు. శనివారం రోజుకు కోపం తగ్గిపోతే వారి పేరుని బుక్ లో కొట్టేస్తాడు అని తెలిపారు. 

దీనితో నారా లోకేష్ రెడ్ బుక్ లాగా మీ సినిమాలో కూడా బుక్ ఉందన్నమాట అయితే అని యాంకర్ అన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ లోకి కూడా చాలా పేర్లు ఎక్కాయి అని అన్నారు. అది చాల పాపులర్ అయింది కదా అని అన్నారు. నాని బదులిస్తూ ఆ రెడ్ బుక్ పాపులర్ కాకముందే మా సినిమా షూటింగ్ మొదలయింది. బహుశా నారా లోకేష్ రెడ్ బుక్ కి ఇన్సిపిరేషన్ మా సినిమాలో బుక్ ఏమో అంటూ నాని ఫన్నీగా తెలిపారు. 

click me!