Megastar Wishes : పుష్ప టీమ్ ను విష్ చేసిన మెగాస్టార్..డియర్ అల్లు అర్జున్ అంటూ..

Published : Dec 16, 2021, 12:01 PM ISTUpdated : Dec 16, 2021, 12:04 PM IST
Megastar Wishes : పుష్ప టీమ్ ను విష్ చేసిన మెగాస్టార్..డియర్ అల్లు అర్జున్ అంటూ..

సారాంశం

పుష్ప టీమ్ కు ట్విట్టర్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది పుష్ప. అన్ని భాషల్లో ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తూ.. పుష్ప బ్యాచ్ ఫుల్ బిజీగా ఉన్నారు.   

పుష్ప(Pushpa) టీమ్ కు ట్విట్టర్ ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి((Megastar  Chiraranjeevi) . ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది పుష్ప. అన్ని భాషల్లో ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తూ.. పుష్ప బ్యాచ్ ఫుల్ బిజీగా ఉన్నారు. 


రేపు (17 డిసెంబర్) రిలీజ్ కు రెడీగా ఉంది పుష్ప(Pushpa) మూవీ. అల్లు అర్జున్(Allu Arjun) - రష్మిక(Rashmika) జంటగా.. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో.. గంధపు చెక్కల స్మగ్లింగ్ కాన్సెప్ట్ తో సుకుమార్(Sukumar) తెరకెక్కించారీ మూవీని. పాన్ ఇండియా లెవల్లో తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈమూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు టీమ్. ఆడియన్స్,బన్నీ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ అంతా పుష్ప రిలీజ్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 


ఇక ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి(Megastar  Chiraranjeevi) ట్వీట్ చేశారు. Pushpa టీమ్ కు బెస్ట్ విషెష్ చెప్పారు. చిరంజీవి ఏమన్నారంటే.. డియర్ అల్లు అర్జున్.. సుకుమార్ .. రష్మిక మీరంతా కూడా ఈ సినిమా కోసం స్వేదం ,రక్తం చిందించారు. ఎంతో హార్ట్ ఫుల్ గా పనిచేశారు. మీ కష్టానికి తగిన ఫలితంగా సూపర్ సక్సెస్ ను మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఈ సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

 


ఫస్ట్ టైమ్ పాన్ ఇండియాన్ టార్గెట్ చేశాడు అల్లు అర్జున్. అటు మలయాళ మార్కెట్ లో కూడా బన్నీకి మంచి ఇమేజ్ ఉంది. అందుకే ఈమూవీలో స్ట్రాంగ్ విలన్ గా మాలీవుడ్ యంగ్ స్టార్  ఫాహద్ ఫాజిల్ ను విలన్ గా తీసుకున్నారు. అన్ని భాషల్లో వరుసగా ప్రెస్ మీట్స్ పెట్టుకుంటూ వస్తున్నారు టీమ్.ఇక ఈమూవీలో  జగపతిబాబు, సునీల్ , ప్రకాశ్ రాజ్ ,అనసూయ కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. పుష్క కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. భారీ కలెక్షన్స్ లక్ష్యంగా పుష్పను ప్లాన్ చేసుకున్నారు టీమ్. 

Also read : Liger Release Date : లైగర్ రిలీజ్ డేట్ ఫిక్స్..రౌడీ హీరో ఫ్యాన్స్ కు పూనకాలే
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ