‘వాల్తేరు వీరయ్య’మెగా సెలబ్రేషన్స్....టైమ్, డేట్, వెన్యూ

Published : Feb 26, 2023, 03:56 PM IST
‘వాల్తేరు వీరయ్య’మెగా సెలబ్రేషన్స్....టైమ్, డేట్, వెన్యూ

సారాంశం

 మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మూవీ వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 115.10 కోట్ షేర్ (రూ. 186.65 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. తెలుగు వెర్షన్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 135.80 కోట్ల షేర్ రాబట్టింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. బాబీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ నెల 13న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.ఈ సినిమా సక్సెస్‌తో చిరంజీవి ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరినట్లు అయ్యింది.   ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 865 థియేటర్స్‌లో విడుదలైంది. ఫస్ట్ డే మిగితా ఏరియాలతో పోల్చితే నైజాంలో ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకుంది. ఒక్క నైజాం ఏరియానే కాదు.. అటు సీడెడ్, ఉత్తరాంధ్రలోను అదిరిపోయే బుకింగ్స్ నమోదు అయ్యాయి..  అంతేకాదు ఈ చిత్రం ఇప్పటికే అమెరికాలో రికార్డ్ లు క్రియేట్ చేసింది. ఇక ఇటు తెలుగు రాష్ట్రాల్లోను వాల్తేరు వీరయ్య సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్‌ను రాబట్టింది.  ఈ సినిమా  బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది.

మార్చి 3, 2023 కు ఈ చిత్రం యాభై రోజులుకు దగ్గర అవటంతో ఈ ఉత్సాహాన్ని మెగా సెలబ్రేషన్స్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు.అదే రోజున ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 mm థియేటర్  లో సాయింత్రం తొమ్మిది గంటలకు ఈ సెలబ్రెషన్స్ భారీ ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు. నైట్ షో కు అభిమానులు హంగామాతో ..ఈ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ సెలబ్రేషన్స్ కు గెస్ట్ గా ఎవరన్నా వస్తారో లేదో చూడాలి.
 
చిరంజీవి మాట్లాడుతూ  ...ఈ సినిమా తీస్తున్నప్పుడే హిట్ అవుతుంది అనుకున్నాము. కానీ ఈ రేంజ్ లో ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. ఈ సినిమా నాన్ బాహుబలి, నాన్ RRR స్థాయిలో హిట్ అయి కలెక్షన్స్ ని తీసుకొస్తుంది. వాల్తేరు వీరయ్య సినిమా నాన్ రాజమౌళి రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇంతటి సక్సెస్ ఇచ్చినందుకు ఈ సక్సెస్ అగ్ర తాంబూలం ప్రేక్షకులకే. నాకు మళ్ళీ ఇంతటి భారీ సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు అని తెలిపారు.
 
ఈ సినిమాతో  మేక‌ర్స్‌కు ప్రాఫిట్స్ బాగానే వ‌చ్చింది.  ఈ మధ్య కాలంలో మెగా హిట్ ఫిల్మ్ ఇది. చిరంజీవి వంటి ఓ సీనియర్ హీరో అంత పెద్ద హిట్ కొడతారని అసలు ఊహించము. యంగ్ హీరోలు కూడా విస్తుపోయే స్దాయిలో కలెక్షన్స్ వర్షం కురిసిందననేది నిజం.   సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 115.10 కోట్ షేర్ (రూ. 186.65 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. తెలుగు వెర్షన్ ప్రపంచ వ్యాప్తంగా రూ. 135.80 కోట్ల షేర్ రాబట్టింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?