Manchu Manoj Marriage: మొదలైన వేడుకలు... మంచు మనోజ్ పెళ్లి కోసం మహా మంత్ర పూజ!

Published : Feb 26, 2023, 03:36 PM ISTUpdated : Feb 26, 2023, 03:41 PM IST
Manchu Manoj Marriage: మొదలైన వేడుకలు... మంచు మనోజ్ పెళ్లి కోసం మహా మంత్ర పూజ!

సారాంశం

మంచు మనోజ్- భూమా మౌనిక పెళ్లి వేడుకలు మొదలైనట్లు సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా ఓ ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారట.

మంచు మనోజ్- భూమా మౌనికల పెళ్లి అనివార్యమే. అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి 3వ తేదీన మనోజ్ వివాహం జరగనుందని సమాచారం. స్పష్టమైన సమాచారం లేని పక్షంలో వేదిక ఎక్కడనేది తెలియదు. మనోజ్ సిస్టర్ మంచు లక్ష్మి ఇంట్లో మాత్రం ఒక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారట. మహా మంత్ర యాగం జరిపిస్తున్నారట. నేడు ఈ పూజా కార్యక్రమం జరుగుతుండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మంచు ఫ్యామిలీకి చెందిన స్నేహితులు, సన్నిహితులు, ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. 

గత ఏడాది మనోజ్-భూమా మౌనిక గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అప్పుడే వీరి పెళ్లి రూమర్స్ మొదలయ్యాయి. ఈ వార్తలు బలపరిచే విధంగా మంచు మనోజ్ మౌనిక కుటుంబానికి దగ్గరయ్యారు. కొన్ని నెలలుగా మనోజ్-మౌనిక అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఫైనల్ గా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 

మనోజ్ 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. 2019లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. మౌనిక సైతం తన భర్తతో విడిపోయారు. ఇక పెళ్ళికి ముందే వీరికి పరిచయం ఉంది. ఒక దశలో పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. కారణాలు తెలియదు కానీ ఇతర వ్యక్తులతో వారికి పెళ్లిళ్లయ్యాయి. వారితో పొసగక పోవడంతో విడాకులయ్యాయి. మరోవైపు ఈ పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదనే ప్రచారం జరుగుతుంది. 

ఈ కారణంతోనే మనోజ్ కొన్నాళ్లుగా ఇంటికి దూరంగా ఉంటున్నాడనే వాదన ఉంది. అయితే మంచు ఫ్యామిలీలో విబేధాల వార్తలను మంచు లక్ష్మి ఖండించారు. అవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు. కాగా మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతుంది. అహం బ్రహ్మస్మి టైటిల్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించి ఆపేశాడు. ఇటీవల 'వాట్ ది ఫిష్' టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నట్లు వెల్లడించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌