
`ఆర్‌ఆర్‌ఆర్`కి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆమెరికాలో ఎన్టీఆర్ అక్కడి స్లాంగ్‌లో మాట్లాడారు. ఆయన అమెరికా యాసలో అద్భుతంగా మాట్లాడారు. దానికి అక్కడి మీడియా ప్రతినిధి సైతం ఆశ్చర్యపోయారు. కానీ మన ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్టీఆర్ యాసపై ట్రోల్స్ జరిగింది. ట్రోలర్స్ ఎన్టీఆర్‌ది ఫేక్ యాక్సెంట్ అని, ఓవర్ చేశాడంటూ కామెంట్లు చేశారు. రెండు మూడు రోజులు అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ ట్రోల్స్ పై చాలా విమర్శలు వచ్చాయి.
తాజాగా నటి కస్తూరి స్పందించింది. ఆమె తీవ్రంగా ఖండించింది. ఎన్టీఆర్‌ని ట్రోల్ చేయడంపెద్ద తప్పు అని వెల్లడించింది. అమెరికా వాళ్లకి వాళ్ల స్లాంగ్‌లోనే మాట్లాడితేనే అర్థమవుతుందని, మన ఇంగ్లీష్‌లో మాట్లాడితే వారికి అర్థం కాదని, ఆ విషయంలో ఎన్టీఆర్ చేసింది చాలా కరెక్ట్. ఆయనది ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోల్ చేశారు, అది చాలా తప్పు. నేను కూడా అమెరికాలో ఉన్నాను, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. వాళ్లకి వాళ్లలాగా మాట్లాడితే అర్థమవుతుందని తెలిపారు. నేను ఇక్కడ నా తమిళ యాక్సెంట్‌లో మాట్లాడితే అర్థమవుతుందా, అర్థం కాదు కదా అంటూ వెల్లడించింది.
ఎన్టీఆర్ అమెరికాలో వెళ్లి అమెరికా యాక్సెంట్‌లో మాట్లాడారంటే అది గొప్ప విషయమని తెలిపింది. అంతేకాదు చాలా బాగా మాట్లాడారని వెల్లడించింది. వాళ్లు ఇక్కడికి వచ్చి తెలుగులో మాట్లాడతారా? మనమెందుకు అమెరికా యాక్సెంట్‌లో మాట్లాడాలి అని అంటున్నారు. కానీ ఎన్టీఆర్ చేసింది కరెక్టే అని చెప్పింది నటి కస్తూరి. ఓ యూట్యూబ్ ఛానెల్(ఇండియా గ్లిడ్జ్) ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా యాంకర్ మంచు లక్ష్మి ప్రస్తావన తీసుకొచ్చారు. మంచు లక్ష్మి కూడా అలాంటి యాసలో మాట్లాడుతుంటే విమర్శించేవాళ్లని తెలిపాడు. దీనికి నటి కస్తూరి రియాక్షన్ షాకిచ్చింది. జెన్యూన్ ఎఫర్ట్ కి, ఫేక్‌కి తేడా ఉంది కదా అంటూ షాకిచ్చింది. హైదరాబాద్‌కి వచ్చిన అలాంటి స్లాంగ్‌లో మాట్లాడితే కచ్చితంగా ట్రోల్ చేస్తారని చెప్పింది. ఇక్కడ తెలుగే మాట్లాడొచ్చు కదా, తెలుగు కూడా అమెరికన్ యాక్సెంట్‌లో మాట్లాడటం ఎందుకు అంటూ చురకలంటించింది కస్తూరి. ఈ విషయంలో ఎన్టీఆర్‌ని, మంచు లక్ష్మితో పోల్చొద్దని వెల్లడించింది కస్తూరి.
ప్రస్తుతం కస్తూరి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెట్టింట రచ్చ చేస్తున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించి మెప్పించింది కస్తూరి. ఇటీవల `గాడ్ ఫాదర్`లోనూ మెరిసింది. ఇక సీరియల్స్ లో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న రాణిస్తుంది కస్తూరి. సీరియల్స్ లో ఆమె మెయిన్ లీడ్‌గా చేస్తుండటం విశేషం.