గబ్బర్ సింగ్ డైరెక్టర్ తో మెగాస్టార్ మలయాళ సినిమా రీమేక్...? బాసు అస్సలు తగ్గట్లేగా

By Mahesh Jujjuri  |  First Published Mar 23, 2022, 7:36 AM IST

మెగాస్టార్ చిరంజీవి తగ్గేదేలే అంటున్నాడు. ఒక సినిమా కంప్లీట్ అవ్వకముందే మరో సినిమాకు సైన్ చేసేస్తున్నాడు. ఎక్కువగా మలయాళ రీమేక్ సినిమాలపై కన్నేశాడు మెగాస్టార్. 


సిక్స్ టీ ప్లస్ లో కూడా సిక్స్ టీన్  హీరోలా దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. సినిమా సినిమాకు గ్యాప్ కూడా ఇవ్వడం లేదు మెగాస్టార్. ఇప్పటికే ఆయన ఖాతాలో దాదాపు ఐదు సినిమాలకు పైగా ఉన్నాయి. ఆచార్య రిలీజ్ కు రెడీగా ఉండగా మరో మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. మరో సినిమా సెట్స్ ఎక్కబోతోంది. ఇక ఇప్పుడు ఇంకో సినిమాను ఆయన లైన్ లో పెట్టబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.  అయితే ఈ  సినిమా డైరెక్ట్ చేసే అవకాశాన్ని చిరంజీవి  హరీష్ శంకర్ కు ఇచ్చినట్టు తెలుస్తోంది. 

అటు యూత్ తో పాటు ఇటు మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ హరీశ్ శంకర్. లవ్, యాక్షన్, ఎయోషన్, కామెడీ అన్ని ఎలిమెంట్స్ హరీష్ శంకర్ సినిమాలో కనిపిస్తాయి.  సగటు ప్రేక్షకుడికి ఏం కావాలో  అవన్నీ తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటాడు శంకర్. ముఖ్యంగా పవర్ స్టార్  పవన్ కి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్.. ప్రస్తుతం ఆయనతో భవదీయుడు భగత్ సింగ్ సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. 

Latest Videos

ఈ సినిమా తరువాత చిరంజీవితో ఒక మలయాళ రీమేక్ ప్రాజెక్ చేయనున్నట్టు గా ఇండస్ట్రీ వర్గాల సమాచారం.మలయాళంలో ఈ జనవరిలో రిలీజ్ అయిన బ్రో డాడీ సినిమా అక్కడ భారీ విజయాన్ని సాధించింది. మోహన్ లాల్ తో కలిసి పృథ్వీ రాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై మెగా కన్ను పడినట్టు తెలుస్తోంది. వెంటే ఈ హక్కులను తీసుకునే పనిలో పడ్డారట చిరంజీవి. 

ఈ సినిమా తెలుగు రీమేక్ లో చిరంజీవి చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇంకా కోస్టార్ ఎవరు అనేది తెలియదు కాని.. ఈ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతలను మాత్రం డైరెక్టర్ హరీశ్ శంకర్ కి అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగు వెర్షన్ కి సంబంధించిన మార్పులు.. చేర్పుల గురించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం.  మరి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

click me!