
సెలెబ్రెటీలకు సంబంధించిన ఏ విషయమైనా న్యూస్ అవుతుంది. తాజాగా సీనియర్ హీరో సంజయ్ కపూర్ (Sanjay Kapoor) కుమార్తె షనయా కపూర్ లగ్జరీ కారు కొన్నారు. 'ఆడి క్యూ 7 ఫేస్ లిఫ్ట్' కారును కొనుగోలు చేసింది. ఈ కారు విలువ రూ. 80 లక్షలు. ఈ ఆడి క్యూ7 2022 వెర్షన్ కారు రెడు వేరియంట్‌లలో వస్తుంది. ఒకటి ప్రీమియం ప్లస్ ధర రూ. 80 లక్షలు. మరొకటి టెక్నాలజీ ధర రూ. 88 లక్షలని సమాచారం. ఈ విషయాన్ని 'ఆడి ముంబై వెస్ట్' కంపెనీ తన ఇన్‌స్టా గ్రామ్ పేజి హ్యాండిల్‌లో షేర్ చేసింది.
ఈ పోస్ట్‌లో తన కొత్త కారుతో షనయా ఫోజులిచ్చిన ఫొటోలను షేర్ చేసింది ఆడి కంపెనీ. ఈ ఫొటోలలో షనయా తల్లిదండ్రులు సంజయ్ కపూర్, మహీప్ కపూర్ ఉన్నారు.ఇదిలా ఉంటే ఈ నెల ప్రారంభంలో ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సినిమా బేధడక్‌తో షనయా బాలీవుడ్‌లో తెరంగ్రేటం అవుతుందని ప్రకటించారు. బేధడక్ సినిమాను శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌లో తెరకెక్కనుంది. ఇందులో లక్ష్య, గుర్ఫతే పిర్జాదా నటిస్తున్నారు.
2020లో విడుదలైన గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ చిత్రంతో సహాయ దర్శకురాలిగా షనయా (Shanaya kapooor)బీటౌన్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. అలాగే నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ది ఫ్యాబులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్‌లో అతిథి పాత్రలో మెరిసింది షనయా కపూర్. ఇందులో ఆమె తల్లి మహీప్ కపూర్ నటించింది.