డియర్ సుమన్ అంటూ..సీనియర్ హీరోకి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు.. ఎందుకంటే..?

Published : Feb 15, 2023, 08:35 PM IST
డియర్ సుమన్ అంటూ..సీనియర్ హీరోకి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు.. ఎందుకంటే..?

సారాంశం

సినియర్ హీరో సుమన్ ను విష్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.. డియర్ సుమన్ అటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇంతకీ ఆయన్ను చిరంజీవి ఎందుకు విష్ చేశారు...? అసలు సంగతేంటి..? 

సీనియర్ స్టార్ హీరోలు ఒకరిని ఒకరు విష్ చేసుకోవడం ఈ మధ్య ఎక్కువైపోయింది. గతంలో కంటే ఎక్కువగా ఈ మధ్య కాలంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వస్తోంది. ఈక్రమంలోనే అకేషన్ ను బట్టి.. ఒకరితో మరొకరు సందర్భాన్ని బట్టి విష్ చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే 90స్ హీరోలలో ఒకరైన సుమన్ కు..మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గా విషెష్ చెప్పారు. ఆయను అభినందిస్తూ.. ఒక వీడియో కూడా తన సోషల్ మీడియా పేజ్ లో రిలీజ్ చేశారు. ఇంతకీ సుమన్ కు చిరంజీవి ఎందుకు విషెష్ చెప్పారంటే..?  

ఈ ఏడాదితో సుమన్ నటుడిగా 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు.. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సుమన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రత్యేకంగా ఓ వీడియోరిలీజ్ చేశారు. డియర్ సుమన్ నటుడిగా 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మై డియర్ బ్రదర్ సుమన్‌కి నా శుభాకాంక్షలు.. పది భాషల్లో 700 లకు పైగా సినిమాలు చేయడం అద్బుతం.. బెంగుళూరులో ఫిబ్రవరి 16న జరుగబోతున్న 45 ఇయర్స్ ఈవెంట్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానంటూ చిరంజీవి చెప్పారు. 

 

అయితే సుమన్ సినిమా కెరీర్ హాఫ్ సెంచరీకి దగ్గరికి రావడంతో.. ఆయనకు సబంధించిన వేడుకలు వెంగళూరులో జరగబోతున్నాయి. ఆ వేడుకలకు మెగాస్టార్ ను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మరి ఈ వేడుకలకు వెళ్ళడం కుదరక ఆయన ఇలా విష్ చేశారా..? లేక ఇలా విష్ చేసినా కూడా ఆయన ఆ వేడుకల్లో పాల్గొంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇక సుమన్ తెలుగు భాషలో హీరోగా వెలుగు వెలిగినా.. ఆయన మాతృ రాష్ట్రం మాత్రం కర్నాటక. తుళు ఫ్యామిలీకి చెందిన సుమన్.. కన్నడ సినిమాలతో పాటు తెలుగులో బాగా పాపులర్ అయ్యాడు. 

తెలుగులోనే హీరోగా సెటిల్ అయిన సుమన్.. ఆరువాత తమిళ,కన్నడ, హిందీ భాషల్లో వందల సినిమాలు చేశారు. ఇప్పిటకీ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆయన అన్నమయ్య సినిమాలో చేసిన వెంకటేశ్వర స్వామి పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నిజంగా వెంకటేషుడు ఇలానే ఉండాడేమో అని ప్రేక్షలు అనుకునే విధంగా.. ఆ పాత్ర ఆయనకు సూట్ అయ్యింది. చిన్న పెద్ద సినిమలననీ చేస్తూ వస్తున్న సుమన్ కొన్ని వివాదాలు కూడా ఎదుర్కొన్నారు. 

ఇక మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టి బోళా శంకర్ సినిమా బిజీలో ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. మేహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈసినిమా తరువాత ఆయన వెంకీ కుడుములతో సినిమా చేసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?