బాలీవుడ్ కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ ప్రొఫెషనల్ మేనేజర్ గా పూజా దద్లానీ పదేండ్లుగా వర్క్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఏడాది సంపాదన.. ఆస్తుల విలువ ఎన్నికోట్లు ఉంటుందనే విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ఫేమస్ ఇండియన్ సెలబ్రేటీ మేనేజర్ పూజా దద్లానీ (Pooja Dadlani) ప్రస్తుతం వార్తలో నిలిచారు. బాలీవుడ్ కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు ప్రొఫెషనల్ మేనేజర్ గా పూజా దద్లానీ పదేండ్లకు పైగా పనిచేస్తున్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు ఆమెనే కొనసాగుతున్నారు. దశాబ్దకాలంగా పనిచేస్తున్న పూజా.. షారుఖ్ ఖాన్ కుటుంబీకులకు బాగా దగ్గరగా ఉంటారు. షారుఖ్ భార్య గౌరీ ఖాన్, పిల్లలు ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్, అబ్రంతోనూ మంచి బాండింగ్ ఉందని తాజాగా వెల్లడించారు.
పూజా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ మేనేజర్ గా పూజా దద్లానీ అతని వృత్తిపరమైన పనిని నిర్వహిస్తుంటారు. ముఖ్యమైన ఈవెంట్‌లు, అవార్డుల ఫంక్షన్‌లు, సమావేశాలు, ప్రమోషన్స్ లో చురుకుగా కనిపిస్తుంటారు. రీసెంట్ గా కింగ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా మూవీ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. ఈ క్రమంలో ముంబైలో అత్యాధునిక, ఆహ్లాదకరమైన డిజైన్స్ తో నిర్మించిన కొత్త ఇంటి ఫొటోలను పంచుకున్నారు. షారుఖ్ ఖాన్ వైఫ్ గౌరీ ఖాన్ తో తన ఇంట్లో దిగిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. కోట్లు విలువ చేసే కొత్తఇంటిని సొంతం చేసుకోవడంతో అందరూ విషెస్ తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా పూజా దొడ్లానీ ఏడాదికి ఎంత సంపాదిస్తారనే అంశం కూడా హాట్ టాపిక్ గా మారింది. స్టార్ మేనేజర్ గా కొనసాగుతూనే ఆమె KKR, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సహా పలు వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా మెన్స్ ఎక్స్పీ.కామ్ నివేదిక ప్రకారం.. పూజా ఆమె నికర ఆస్తుల విలువ రూ. 45 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఇక ఏడాదికి ఈవె రూ. 7 నుండి 9 కోట్లు వరకు సంపాదిస్తారని టాక్ వినిపిస్తుండటం షాకింగ్ గా ఉంది.