Prabhas-Allu Arjun: టాలీవుడ్ టాప్ 5 గ్రాసర్స్.. ఆ ఇద్దరు హీరోలవే!

By Sambi ReddyFirst Published Jan 2, 2022, 12:47 PM IST
Highlights

ప్రభాస్ ని స్ఫూర్తిగా తీసుకున్న మన టాప్ స్టార్స్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. పుష్ప మూవీతో అల్లు అర్జున్ హిందీ చిత్ర సీమలో తన అదృష్టం పరీక్షించుకున్నారు. పుష్ప ఊహకు మించిన వసూళ్లు సాధిస్తుండగా.. అల్లు అర్జున్ అడుగు అక్కడ పడినట్లే అన్న మాట వినిపిస్తుంది.

స్టార్ డమ్ అంటే పాన్ హీరోయిన్ కావడమే అన్నట్లు తయారైంది పరిస్థితి. దేశంలోని అన్ని పరిశ్రమల్లో మార్కెట్ ఏర్పరుచుకొని వందల కోట్ల హీరోలుగా ఎదగాలనుకుంటున్నారు టాలీవుడ్ స్టార్స్. ఒకప్పుడు పక్కనే ఉన్న కోలీవుడ్ ని కూడా చేరుకోలేని మన హీరోలు ఏకంగా హిందీ పరిశ్రమను దున్నేస్తున్నారు. టాలీవుడ్ చిత్రాలపై అక్కడి ప్రేక్షకులకు నమ్మకం ఏర్పడింది. వరుసగా మూడు సినిమాలతో రికార్డు కలెక్టన్స్ నమోదు చేసిన ప్రభాస్ ఈ విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఆయన నటించిన బాహుబలి 2 దేశంలోనే టాప్ గ్రాసర్ గా ఉంది. 

ప్రభాస్ ని స్ఫూర్తిగా తీసుకున్న మన టాప్ స్టార్స్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. పుష్ప మూవీతో అల్లు అర్జున్ హిందీ చిత్ర సీమలో తన అదృష్టం పరీక్షించుకున్నారు. పుష్ప ఊహకు మించిన వసూళ్లు సాధిస్తుండగా.. అల్లు అర్జున్ అడుగు అక్కడ పడినట్లే అన్న మాట వినిపిస్తుంది. పుష్ప హిందీ వర్షన్ రూ. 75 కోట్ల గ్రాస్ కి దగ్గరైనట్లు సమాచారం. ఆ విధంగా పుష్ప అక్కడ హిట్ వెంచర్ అని చెప్పాలి. 

ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించినట్లే చెప్పవచ్చు. ఇక టాలీవుడ్ నుండి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ప్రభాస్, అల్లు అర్జున్ చిత్రాలు నిలిచాయి. ప్రభాస్ మూడు చిత్రాలతో, రెండు చిత్రాలతో అల్లు అర్జున్ టాప్ ఫైవ్ లో నిలిచారు. 

ప్రభాస్ బాహుబలి 2, బాహుబలి, సాహో వరుసగా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ గా రికార్డులకు ఎక్కాయి. ఆ తర్వాత పుష్ప, అల వైకుంఠపురంలో చిత్రాలతో అల్లు అర్జున్ టాప్ ఫైవ్ లో స్థానం సంపాదించారు. ఆర్ ఆర్ ఆర్ విడుదల వాయిదా నేపథ్యంలో కొన్నాళ్ల వరకు ఈ రికార్డ్స్ సేఫ్. ప్రభాస్, అల్లు అర్జున్ రికార్డ్స్ బ్రేక్ చేసే సత్తా అవకాశం ఇతర చిత్రాలకు ఉండకపోవచ్చు. ఎందుకంటే చిరంజీవి ఆచార్య, భీమ్లా నాయక్ కేవలం తెలుగులో మాత్రమే విడుదల అవుతున్నాయి. అయితే రాధే శ్యామ్, సలార్ చిత్రాలతో ప్రభాస్ ఈ లెక్కలు సరిచేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి టాలీవుడ్ టాప్ ఫైవ్ గ్రాసర్స్ గా ప్రభాస్, అల్లు అర్జున్ చిత్రాలు నిలిచాయి. 

Also read Pushpa: ఆ సీన్ డిలేట్ చేయటం వెనక అసలు కారణం ఇదా?
ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ విడుదల వాయిదాతో పుష్ప చిత్రానికి మరింత కలిసొచ్చే అవకాశం కలదు. సంక్రాంతికి పెద్ద చిత్రాల విడుదల లేని నేపథ్యంలో పుష్ప చిత్రానికి వసూళ్లు కలిసి రావచ్చు. మొత్తంగా ప్రతికూల పరిస్థితులు కూడా పుష్పకు అనుకోకుండా కలిసొస్తున్నాయి. 

Also read RRR Postponement:ఆర్ ఆర్ ఆర్ వెనక్కి పోయిందిగా.. భీమ్లా నాయక్ ని ముందుకు తెండి!

click me!