ఇండస్ట్రీలో పెద్దరికం వద్దని ఓ వైపు చిరంజీవి (chiranjeevi) అంటుంటే ఇప్పుడు మోహన్ బాబు (mohan babu) సినిమా టికెట్ల వివాదంపై రేపు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తానని అంటున్నారు. మరి ఇండస్ట్రీలో (tollywood) పెద్దరికం తీసుకోవడానికి మోహన్ బాబు సిద్ధమవుతున్నారా..? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇండస్ట్రీలో పెద్దరికం వద్దని ఓ వైపు చిరంజీవి (chiranjeevi) అంటుంటే ఇప్పుడు మోహన్ బాబు (mohan babu) సినిమా టికెట్ల వివాదంపై రేపు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తానని అంటున్నారు. మరి ఇండస్ట్రీలో (tollywood) పెద్దరికం తీసుకోవడానికి మోహన్ బాబు సిద్ధమవుతున్నారా..? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సినిమా టికెట్ల వివాదం, థియేటర్ల మూసివేతపై మా అధ్యక్షుడు మంచు మనోజ్ కానీ ఇటు మోహన్ బాబు కానీ ఇంత వరకు స్పందించలేదు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు తొలిసారిగా స్పందించడం.. అది కూడా చిరంజీవి తనకు పరిశ్రమ పెద్దరికం వద్దన్న తర్వాత మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
సినిమా టికెట్ ధరల తగ్గింపుతో పాటు థియేటర్ల వివాదంపై ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ కన్వీనర్‌గా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు , ఛాంబర్ ప్రతినిధులు, సినీ గోయర్స్‌తో కమిటీ ఏర్పాటైంది. జీవో 35 ప్రకారం టికెట్ల ధరలు తమకు గిట్టుబాటు కావంటున్న సినీ పరిశ్రమ విజ్ఞప్తిపై హైకోర్టు ఆదేశాలతో ఈ కమిటీ ఏర్పాటైంది.
ALso Read:RRR Postponement:ఆర్ ఆర్ ఆర్ వెనక్కి పోయిందిగా.. భీమ్లా నాయక్ ని ముందుకు తెండి!
మరోవైపు Andhra pradesh రాష్ట్రంలో Cinema థియేటర్ల ఓనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం శుభవార్త తెలిపింది. సీజ్ చేసిన Theatres ఓపెన్ చేసుకొనేందుకు అనుమతిని ఇచ్చింది.ప్రభుత్వం ఆదేశించిన నిబంధనల మేరకు నెల రోజుల్లో అన్ని వసతులను కల్పించాలని ప్రభుత్వం థియేటర్ల ఓనర్లకు సూచించింది. ఏపీ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని 83 థియేటర్లను రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసింది.
రాష్ట్రంలోని 9 జిల్లాల్లో సుమారు 83 థియేటర్లను సీజ్ చేశారు. అయితే పలు రకాల కారణాలతో ఈ థియేటర్లను సీజ్ చేశారు.. ప్రభుత్వం సూచించినట్టుగా వసతులను సినిమా థియేటర్లలో కల్పించలేదు. దీంతో ప్రభుత్వం సినిమా థియేటర్ల యజమానులకు సవయం ఇచ్చింది. అయినా వారిలో మార్పు రాకపోవడంతో సినిమా థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వసతులు లేని సినిమా థియేటర్లను అధికారులు సీజ్ చేశారు.
అయితే కొన్ని సినిమా థియేటర్లకు లైసెన్సులు కూడా రెన్యూవల్ చేసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది. రెండు రోజుల క్రితం కృష్ణా జిల్లాకు చెందిన సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినానితో సమావేశమయ్యారు. తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సినిమా టికెట్ల ధరలను పెంచుకొనేందుకు అవకాశం ఇవ్వాలని కూడా కోరారు.