సంక్రాంతికి తగ్గేదెలే అంటోన్న నిర్మాతలు.. `సలార్‌` డైలాగ్‌తో `హనుమాన్‌` డైరెక్టర్ వార్నింగ్‌..

By Aithagoni RajuFirst Published Dec 22, 2023, 11:09 PM IST
Highlights

సంక్రాంతి రిలీజ్‌ సినిమాల విషయంలో రాజీకుదిర్చేందుకు, నిర్మాతలుఫిల్మ్ ఛాంబర్‌లో కౌన్సిల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమక్షంలో ఈ మీటింగ్‌ జరిగిందట..

సంక్రాంతి పోరు ఇప్పుడే ప్రారంభమయ్యింది. సంక్రాంతి పందెంకోళ్లు ఇప్పుడు గొడవ పడుతున్నాయి. ఎవరికి వాళ్లు తగ్గేదెలే అంటున్నారు. తమ సినిమాలను పండక్కి రెడీ చేసుకుంటున్నారు. రాజీ కోసం కూర్చొన్నా తెగలేదు. ఎవరూ తగ్గడం లేదు. దీంతో రచ్చ గట్టిగానే కొడుతుంది. దీనికితోడు `హనుమాన్‌` చేసిన ట్వీట్‌ మరింత కాక రేపుతుంది. ఇతర నిర్మాతలకు స్ట్రాంగ్‌గానే వార్నింగ్‌ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఏకంగా `సలార్` డైలాగ్‌తో ప్రశాంత్‌ వర్మ హెచ్చరించడం విశేషం. 

క్రిస్మస్‌ సీజన్‌ పూర్తయ్యింది. కొత్త సంవత్సరం హడావుడి పెద్దగా ఉండదు. కానీ సంక్రాంతి కోసమే చాలా సినిమాలు పోటీ పడుతుంటాయి. ఆ సమయంలో మూడు నాలుగు సినిమాలు ఆడేందుకు స్కోప్‌ ఉంటుంది. పెద్దగా బాగలేని సినిమాలు కూడా మంచి కలెక్షన్లని రాబడుతుంటాయి. సంక్రాంతి మహిమ అలాంటిది. అందుకే ఆ డేట్‌ని వదులుకోరు నిర్మాతలు. ఆ సమయంలోనే వచ్చేందుకు పోటీ పడుతుంటారు. అయితే ఈ గొడవ ఎప్పుడూ ఉండేదే. కానీ ఈ సారి దాని డోస్‌ మరింత పెరిగింది. ఎవరూ తగ్గలేనంతగా పెరుగుతుంది. 

Latest Videos

సంక్రాంతి రిలీజ్‌ సినిమాల విషయంలో రాజీకుదిర్చేందుకు, నిర్మాతలుఫిల్మ్ ఛాంబర్‌లో కౌన్సిల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమక్షంలో ఈ మీటింగ్‌ జరిగిందట. పొంగల్‌కి `గుంటూరు కారం`, `ఈగల్‌`, `హనుమాన్‌`, `నా సామి రంగ` వంటి సినిమాలున్నాయి. వీటితోపాటు ఒకటి రెండు చిన్న సినిమాలు కూడా పోటీలో ఉంటాయి. అయితే భారీ సినిమాలు కావడంతో కలెక్షన్ల సమస్య వస్తుందని  భావిస్తున్నారు నిర్మాతలు.రాజీ ప్రయత్నాలు చేయగా ఎవరూ తగ్గడం లేదట. 

శుక్రవారం జరిగిన మీటింగ్‌లో మహేష్‌బాబు నటిస్తున్న `గుంటూరు కారం` నుంచి నాగవంశీ వచ్చాడు. రవితేజ `ఈగల్‌` మూవీ నుంచి విశ్వప్రసాద్‌, నాగార్జున `నా సామి రంగం` చిత్రం నుంచి శ్రీనివాస్‌ చిట్టూరి వచ్చారు. కానీ `హనుమాన్‌` నిర్మాత మాత్రం రాలేదు. రాజీ ఇష్టం లేకనే ఆయన రాలేదని తెలుస్తుంది. దిల్‌రాజు.. వీరిలో ఒకరిద్దరిని తగ్గమని చెప్పారు. కానీ ఎవరూ తగ్గడం లేదట. తగ్గేదెలే అని చెబుతున్నారట. తామే రిలీజ్‌ డేట్లు ముందు ప్రకటించినట్టు చెబుతున్నారు. 

`గుంటూరు కారం`తో `హనుమాన్‌` పోటీ పడుతుంది. కానీ తమ సినిమాని వాయిదా వేసుకునే ఛాన్సే లేదని చెబుతున్నాడు. అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.  `సలార్` సినిమా ట్రైలర్‌లో ఉన్న `ప్లీజ్‌ ఐ కైండ్లీ రిక్వెస్ట్ అంటూ వార్నింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు ప్రశాంత్‌ వర్మ. `గుంటూరు కారం`తో పోటీకి రెడీ అయ్యాడు. ఇదే ఇప్పుడు రచ్చ చేస్తుంది. మరి దీనిపై మరోసారి కలిసి మాట్లాడబోతున్నారు. అప్పుడు ఎవరు వెనక్కి తగ్గుతారో తెలియాల్సి ఉంది. కానీ ఇదిప్పుడు హాట్‌ టాపిక్‌గా ఉంది. 
 

Please... I... Kindly… Request!

— Prasanth Varma (@PrasanthVarma)
click me!