విజయ్ దేవరకొండ బెడ్‌ షేర్‌ చేసుకుందెవరో తెలుసా? పెళ్లాం లేచిపోవడంతో.. ఆనంద్‌ దేవరకొండ అదిరిపోయే రియాక్షన్‌

By Aithagoni RajuFirst Published Nov 11, 2021, 12:34 AM IST
Highlights

ఆనంద్‌ దేవరకొండ.. సుందర్‌ పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో ఆయన భార్య లేచిపోతుంది. దీన్ని దేవరకొండ హీరోలు ఇలా ఫన్నీగా చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా అది ట్రెండ్‌ అవుతుంది. 

`ఏ సుందర్‌ నీ పెళ్లామేదీ.. ఇక్కడెందుకు పడుకున్నావ్.. నీ పెళ్లాం ఎక్కడికిపోయింది.. అంటూ తన బెడ్‌పై పడుకున్న వ్యక్తిని విసిగిస్తున్నాడు విజయ్‌ దేవరకొండ. దీంతో తట్టుకోలేకపో నా పెళ్లాం లేచిపోయిందిరా బై అంటాడు ఆ సుందర్‌`. ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda)తన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ(Anand Devarakonda) హీరోగా `పుష్పక విమానం`(Pushpaka Vimanam) సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దామోదర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. 

ఇందులో Anand Devarakonda.. సుందర్‌ పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో ఆయన భార్య లేచిపోతుంది. దీన్ని దేవరకొండ హీరోలు ఇలా ఫన్నీగా చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా అది ట్రెండ్‌ అవుతుంది.  చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల వైజాగ్‌లో ఈవెంట్‌ నిర్వహించారు. ఆ రోజు రాత్రి విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ కలిసి బెడ్‌ షేర్‌ చేసుకుని మార్నింగ్‌ సరదాగా ఈ వీడియో చేయాలనుకున్నారు. అన్న విజయ్‌ ఇచ్చిన ఐడియా నచ్చడంతో ఓకే చెప్పాడు ఆనంద్‌ దేవరకొండ. ఏదో అనుకుని చేశామని, ఇప్పుడని ట్రెండ్‌ అవడం ఆనందంగా ఉందని చెప్పాడు ఆనంద్‌దేవరకొండ. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

Guess who is sharing the bed with me today 😉

Book your tickets now - https://t.co/0neeFHptsf pic.twitter.com/qQrDTt5dSr

— Vijay Deverakonda (@TheDeverakonda)

`అన్నయ్య విజయ్‌, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. అన్నదమ్ములమనే ఫీలింగ్‌ ఉండదు. ఆయనకు సంబంధించిన ప్రతిదీ షేర్‌ చేసుకుంటారు. అయితే హీరోగా ఎవరికి వారు ఎదగాలనుకుంటున్నాం. అన్నయ్య పెద్ద బడ్జెట్‌ సినిమా, మాస్‌,యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. `అర్జున్‌రెడ్డి` హిట్‌ కావడంతో ఆయనకు ఆ ఇమేజ్‌ వచ్చింది. నా పరిస్థితి అలా కాదు. నేను నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ జనంలో ఓ గుర్తింపు తెచ్చుకోవాలి. ఆయనలా చేస్తే ఎలాంటి ఉంటుందో తెలియదు, సక్సెస్‌ అయితే ఒకలా ఉంటుంది, ఫెయిల్‌ అయితే మరోలా ఉంటుంది. ఆ టైమ్ వరకు వేచి చూడాల్సిందే` అని చెప్పాడు ఆనంద్.

తమ కింగ్‌ హిల్స్ బ్యానర్‌లో దర్శకుడు రామోదర్‌తో సినిమా చేయాలనుకున్నారట. మిగిలిన హీరోలు నో చెప్పడంతో తాను చేస్తే ఎలా ఉంటుందని భావించి చేశామన్నారు ఆనంద్‌. `పెళ్లాం లేచిపోయిన వ్యక్తి హీరో అవడం వాళ్లు సందేహించేలా చేసింది. మొదట్లో నాకు కూడా ఈ క్యారెక్టర్ చేయగలనా లేదా అనే డౌట్ వచ్చింది. టెస్ట్ షూట్ చేసిన తర్వాత నమ్మకం కుదిరి ఒప్పుకున్నాను. పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకుంటాడు టీచర్ గా పనిచేసే చిట్టిలంక సుందర్ అనే వ్యక్తి. కానీ పెళ్లయ్యాక అతని ఆశలన్నీ తలకిందులు అవుతాయి. భార్య లేచిపోతుంది. కానీ ఆ విషయం మీద పోలీస్ కంప్లైంట్స్ ఇవ్వలేక తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో హీరోకు కోపం, ఫ్రస్టేషన్ వస్తుంటాయి. చూసే వాళ్లకు కూడా హీరో మీద జాలి కలుగుతుంది. పూర్తి ఫన్‌ బేస్డ్ చిత్రమిది. మంచి ట్విస్టులుంటాయ`ని చెప్పారు.

`నా మొదటి సినిమా `దొరసాని` అనుకున్నంత విజయం సాధించలేదు అనిపిస్తుంటుంది. `మిడిల్ క్లాస్ మెలొడీస్` సినిమా టైమ్ కు ఆ కథ ఎంత వర్కవుట్ అవుతుంది అనేది మాకు అంచనా లేదు. అంతా బొంబాయి చట్నీ కథ అనేవారు. కానీ ఆ కథలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయని మాకు నమ్మకం. అది వర్కవుట్ అయ్యింది. పాండమిక్ వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది. `మిడిల్ క్లాస్ మెలొడీస్` కూడా పాండమిక్ వల్ల డైరెక్ట్ ఓటీటీ కి వెళ్లింది. ఈ సినిమాకు అదే జరుగుతుందా అని భయపడ్డాం. కానీ థియేటర్ లోనే రిలీజ్ చేయాలని గట్టిగా అనుకున్నాం. కొంత ఆలస్యమైన పుష్పక విమానం సినిమా భారీగా థియేటర్లలో రిలీజ్ అవుతుండటం సంతోషంగా ఉంది. 

అన్నయ్య విజయ్ కు పుష్పక విమానం సినిమా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను బాగా ప్రమోట్ చేద్దామని ముందుకొచ్చాడు. మా సినిమా ప్రమోషన్ కు వచ్చిన అల్లు అర్జున్ అన్నకు థాంక్స్. ఆయన చాలా సపోర్ట్ చేసి టైమ్ ఇచ్చారు. ట్రైలర్ బాగుందని బన్నీ అన్న చెప్పడం వల్ల మా సినిమాకు మంచి బూస్టప్ వచ్చింది. ఆయన ఫ్యాన్స్ కూడా మాకు బాగా సపోర్ట్ గా ఉంటున్నారు. 

నెక్ట్ కేవీ గుహన్ గారు, సాయి రాజేశ్ వంటి దర్శకులతో సినిమాలు చేయబోతున్నాను. వీటిలోనూ నా క్యారెక్టర్స్ సహజంగా మన చుట్టూ ఉండే అబ్బాయిలా ఉంటాయి. హీరో కొడతే పదిమంది ఎగరిపడాలనే ఇప్పటి ప్రేక్షకులకు అంతగా నచ్చడం లేదు. పుష్పక విమానం లాంటి కొత్త తరహా కథల్లో నటించేందుకు నటీనటులు సిద్ధం అవుతున్నారు. అటు ఆఢియెన్స్ కూడా ఇలాంటి కొత్త కథలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి నా లాంటి ఆర్టిస్టులకు ఇన్నోవేటివ్ సబ్జెక్ట్స్ చేసేందుకు స్కోప్ దొరుకుతోంది` అని తెలిపాడు ఆనంద్‌ దేవరకొండ. 

also read: Allu Arjun: ఐకాన్‌ స్టార్‌కి సజ్జనార్‌ బిగ్‌ షాక్‌.. ప్రతిష్టని కించపరిచారంటూ నోటీసులు జారీ

click me!