మెగాస్టార్ న్యూ లుక్ అదిరింది!

Published : Oct 07, 2018, 05:26 PM IST
మెగాస్టార్ న్యూ లుక్ అదిరింది!

సారాంశం

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే మెగాస్టార్ వయసు పెరిగిన కొద్దీ యువకుడిలానే కనిపిస్తున్నారు. 

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కనిపించి కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. అందుకే మెగాస్టార్ వయసు పెరిగిన కొద్దీ యువకుడిలానే కనిపిస్తున్నారు. అది కరెక్ట్ కాదని ఎవరైనా అంటే పైన కనిపిస్తోన్న ఫొటో చూపించి తీరాల్సిందే. 

బ్లాక్ కలర్ డెనిమ్ షర్టు. దానికి  రెండు జేబులు..ఫేడెడ్ బ్లూ జీన్స్ అండ్ భుజానికి మరో స్టైలిష్ బ్యాగ్ వేసుకొని మెగాస్టార్ యంగ్ గా కనిపిస్తున్నారు.దానికి తోడు ఆయన ఫిట్ నెస్ మరింత ఆకర్షించే విధంగా ఉండడంతో అభిమానులు ఫొటోని తెగ షేర్ చేస్తున్నారు. మరోసారి అసలైన బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ట్యాగ్ లైన్స్ ఇచ్చేస్తున్నారు. 

మెగాస్టార్ ఈ కొత్త లుక్ లో దర్శనమివ్వడానికి అసలు కారణం సైరా షూటింగ్ కోసమే. ప్రస్తుతం సైరా షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. దీంతో షూటింగ్ కి వెళ్లేముందు తీసిన ఫొటో ఇదే. అది బయటకు రావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఆ  ప్రాజెక్టును రామ్ చరణ్ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?
Akhanda 2 Premiers: అఖండ 2 చిత్రానికి మరో కోలుకోలేని దెబ్బ.. ప్రీమియర్ షోల అనుమతి రద్దు చేసిన హైకోర్టు