చిన్న పదవి కోసం లోకువ అవుతారా.. మీడియాకు మాత్రం ఆహారం కావొద్దు: ‘‘మా’’ పరిణామాలపై చిరు హాట్‌ కామెంట్స్

By Siva KodatiFirst Published Oct 10, 2021, 10:21 PM IST
Highlights

మా ఎన్నికలపై (maa elections) మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) స్పందించారు. అల్లర్లతో తమ పరువు తీయొద్దన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కానీవ్వొద్దని చిరు హితవు పలికారు. వివాదాలతో చులకన కావొద్దని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు.

మా ఎన్నికలపై (maa elections) మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) స్పందించారు. అల్లర్లతో తమ పరువు తీయొద్దన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కానీవ్వొద్దని చిరు హితవు పలికారు. వివాదాలతో చులకన కావొద్దని సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. అందరి హీరోల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం వుంటే ఎలాంటి గొడవలు వుండవని ఆయన అభిప్రాయపడ్డారు. పదవులు రెండేళ్లు, మూడేళ్లు వుంటాయని.. వాటి కోసం మాటలు అనడం, అనిపించుకోవడం వల్ల బయటి వాళ్లకి ఎంత లోకువ అవుతామని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక పదవి కోసం లోకువ కావాల్సిన అవసరం లేదని మెగాస్టార్ అన్నారు. తాను ఏ ఒక్కరిని వేలు పెట్టి చూపించడం లేదని విజ్ఞతతో ఆలోచించాలని చిరు సూచించారు. ఆధిపత్యం చూపించుకోవడానికి అవతలి వారిని కించపరచాల్సిన అవసరం లేదని  ఆయన హితవు పలికారు. ఎక్కడ సమస్య ప్రారంభమైందో అక్కడ హోమియోపతి వైద్యం చేయాలని చిరంజీవి సూచించారు. పరిశ్రమలో గొడవలకు కారణమైన వ్యక్తులకు దూరంగా వుండాలని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమ (tollywood) అనేది వసుదైక కుటుంబమని.. మీడియా వాళ్లకి మనం ఆహారం కాకూడదని చిరంజీవి వ్యాఖ్యానించారు. 

Also Read:MAA elections:మా అధ్యక్షుడిగా మంచు విష్ణు..!

కాగా, మా యుద్ధంలో మంచు విష్ణుదే (manchu vishnu) తుది విజయం అయ్యింది. ఆయన ఏకపక్ష విజయం సాధించారు. మంచు విష్ణు ఏకంగా 400 ఓట్లకు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించారు. అధికార ప్రకటన మిగిలి ఉంది. ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ప్రకాష్ రాజ్ (prakash raj) పై మంచు విష్ణు గెలుపొందారని సమాచారం. పోస్టల్ బ్యాలెట్ (postal ballot) ఓట్లలో మంచు విష్ణు ఆధిక్యం చూపించగా, జనరల్ బ్యాలెట్ లో కూడా మంచు విష్ణు జోరు చూపించారట.

మంచు ప్యానెల్ నుండి కీలకమైన జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్ పదవులు రఘుబాబు (raghu babu), శివబాలాజీ (shiva balaji) దక్కించుకుంటున్నారు. అదే ప్యానెల్ నుండి మాదాల రవి (madala ravi), పృథ్వి (prudhvi) కూడా ఆధిక్యంలో ఉన్నారని సమాచారం. అయితే ఎగ్జిక్యుటివ్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన బాబు మోహన్ (babu mohan) ఓటమిపాలయ్యారు. ఆయనపై ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి పోటీ చేసిన శ్రీకాంత్ (srikanth) 125 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీనితో ఎప్పటిలాగే మా కమిటీ ఇరు ప్యానెల్ సభ్యులతో మిక్స్ కానుంది.

click me!