MAA elections:మా అధ్యక్షుడిగా మంచు విష్ణు..!

Published : Oct 10, 2021, 09:08 PM ISTUpdated : Oct 10, 2021, 09:22 PM IST
MAA elections:మా అధ్యక్షుడిగా మంచు విష్ణు..!

సారాంశం

ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందారని సమాచారం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మంచు విష్ణు ఆధిక్యం చూపించగా, జనరల్ బ్యాలెట్ లో కూడా మంచు విష్ణు జోరు చూపించారట.   

రెండు నెలల మా యుద్ధంలో మంచు విష్ణుదే తుది విజయం అయ్యింది. ఆయన ఏక పక్ష విజయం సాధించారు. మంచు విష్ణు ఏకంగా 400 ఓట్లకు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించారు. అధికార ప్రకటన మిగిలి ఉంది. ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు గెలుపొందారని సమాచారం. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో మంచు విష్ణు ఆధిక్యం చూపించగా, జనరల్ బ్యాలెట్ లో కూడా మంచు విష్ణు జోరు చూపించారట.


మంచు ప్యానెల్ నుండి కీలకమైన జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్ పదవులు రఘుబాబు, శివబాలాజీ దక్కించుకుంటున్నారు. అదే ప్యానెల్ నుండి మాదాల రవి, పృథ్వి కూడా ఆధిక్యంలో ఉన్నారని సమాచారం. అయితే ఎగ్జిక్యుటివ్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన బాబు మోహన్ ఓటమిపాలయ్యారు. ఆయనపై ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి పోటీ చేసిన శ్రీకాంత్ 125 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీనితో ఎప్పటిలాగే మా కమిటీ ఇరు ప్యానెల్ సభ్యులతో మిక్స్ కానుంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి హేమ సైతం ఆధిక్యంలో ఉన్నారని సమాచారం. 
 

Also read MAA elections: మంచు విష్ణు ప్యానెల్ నుండి జీవిత రాజశేఖర్ పై రఘుబాబు విజయం.. ట్రెజరర్ గా శివబాలాజీ సైతం!

ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి జనరల్ సెక్రెటరీగా పోటీ చేసిన జీవిత ఓటమిపాలయ్యారు. మంచు విష్ణు ప్యానెల్ నుండి అదే పదవికి పోటీ పడ్డ రఘుబాబు విజయం సాధించారు. కేవలం 8 ఓట్ల మెజారిటీతో రఘుబాబు గెలిచారు. మా కమిటీ మెంబర్స్ లో ప్రధానమైన జనరల్ సెక్రెటరీ, ట్రెజరర్ పదవులు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కోల్పోయింది. ట్రెజరర్ గా శివబాలాజీ గెలుపొందారు. ప్రస్తుత మా జనరల్ సెక్రెటరీగా జీవిత ఉండగా.. ఆమె ఆ పదవి కోల్పోయారు. 

 ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి పోటీ పడిన నాగినీడుపై శివబాలాజీ  గెలుపొందడం జరిగింది. కీలకమైన మా కార్యనిర్వాహక వర్గంలో ట్రెజరర్ ఒకటి కాగా, బాలాజీ ఆ పదవిని కైవసం చేసుకున్నారు. నరేష్ అధ్యక్షుడిగా ఉన్న గత మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో శివబాలాజీ ట్రెజరర్ గా ఉన్నారు. మరోమారు వరుసగా ఆయన ఈ పదవిని చేపట్టారు. దీనితో మరో రెండేళ్లు మా లో శివబాలాజీ ట్రెజరర్ గా ఉండనున్నారు.  

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: స్వప్న చెంప పగలకొట్టిన కావేరి- ఒక్కటైన కాశీ, స్వప్న- అంతా నటనేనా?
Peddi : పెద్ది సెట్‌లో అసలు పెద్దలు.. చిరంజీవి, సుకుమార్ సర్‌ప్రైజ్, వీడియో వైరల్