Bigg Boss5లో శ్రీరామ్‌కి బిగ్‌ షాక్‌.. హమీద ఎలిమినేటెడ్‌..

Published : Oct 10, 2021, 09:21 PM ISTUpdated : Oct 10, 2021, 09:33 PM IST
Bigg Boss5లో శ్రీరామ్‌కి బిగ్‌ షాక్‌.. హమీద ఎలిమినేటెడ్‌..

సారాంశం

హమీదని అరియానా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ వారం హమీద ఎలిమినేట్‌ అవుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో అందరు షాక్‌కి గురయ్యారు.   

బిగ్‌బాస్‌5 ఐదో వారం ఎలిమినేట్‌ అయ్యింది ఎవరో తెలిసిపోయింది. ప్రస్తుతం ఇంకా ప్రోగ్రామ్‌ జరుగుతుంది. `నవరాత్రిస్పెషల్‌`గా నాలుగు గంటల ప్రోగ్రామ్‌ కంటిన్యూ అవుతుంది. అయితే ఇందులో బ్రేక్‌లో అసలు విషయం తెల్చేశారు బిగ్‌బామ్‌ టీమ్‌. హమీదని అరియానా ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ వారం హమీద ఎలిమినేట్‌ అవుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో అందరు షాక్‌కి గురయ్యారు. 

ఈ వారం hamida ఎలిమినేట్‌ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఆమె sreeramతో పులిహోర కలుపుతుంది. ఈ లవ్‌ స్టోరీ ఆడియెన్స్ కి ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమెని ఇప్పట్లో ఎలిమినేట్‌ చేయరని అనుకున్నారు. కానీ అందరి ఊహాలకు షాక్‌ ఇచ్చారు. హమీదని ఎలిమినేట్‌ చేశారు. ముఖ్యంగా శ్రీరామ చంద్రకి బిగ్‌కి షాక్‌ ఇచ్చారు.

also read: బిగ్ బాస్ 5: నాగార్జునకే కన్నీళ్లు తెప్పించిన హౌస్ మేట్స్

శ్రీరామ్‌, హమీద రియల్‌ లవర్స్ లాగా ఉన్నారు. కెప్టెన్‌గా శ్రీరామ్‌ ఉన్నప్పుడు తనే కెప్టెన్ గా చేసింది హమీద. పైగా గ్లామర్‌ పరంగానూ హౌజ్‌ని అలరిస్తుంది. కానీ గేమ్‌ల పరంగా చాలా డల్‌గా ఉంది హమీద. అదే ఆమె ఎలిమినేషన్‌కి కారణమైందని అంటున్నారు నెటిజన్లు.  సరైన పర్‌ఫెర్మెన్స్ లేకపోవడం వల్లే ఎలిమినేషన్‌ అయ్యిందని అంటున్నారు. పులిహోర కలపడం కంటే గేమ్‌ ముఖ్యమనే విషయం వెల్లడించారు ఆడియెన్స్. 

ఇప్పటికే Bigg Boss5లో ఈ ఆదివారం ఐదు వారాలు పూర్తయ్యింది. ఇందులో ఇప్పటికే సరయు, ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్, లహరి ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడు హమీద ఎలిమినేట్‌ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే