అంతా రామ్ చరణే చేశాడు.. సల్మాన్‌ ని తీసుకొచ్చిందీ అతనే.. ` గాడ్‌ ఫాదర్‌` తెరవెనుక కథ బయటపెట్టిన మెగాస్టార్‌

By Mahesh JujjuriFirst Published Sep 28, 2022, 11:00 PM IST
Highlights

అంతా రామ్ చరణ్ వల్లే .. నాదేం లేదు అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. గాడ్ ఫాదర్ క్రెడిట్ మొత్తం తనదే అంటున్నాడు చిరు. ఈ సినిమా కోసం చరణ్ చాలా చేశాడంటూ.. వివరంగా చెప్పాడు మెగా హీరో. 

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో గ్రాంగ్ డా జరుగుతుంది. మెగాస్టార్ రావడం ఆలస్య అయినా.. లక్షలాదిగా తరలి వచ్చి న అభిమానులు ఆయనకోసం ఎదురు చూశారు. అతా సవ్యంగా జరుగుతుంది అనుకున్న టైమ్ లో వర్షం రావడం తో పరిస్థితి మారిపోయింది. అయినా వర్షంలోనే  స్పీచ్ స్టార్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇక గాడ్ ఫాదర్ మూవీ గురించి మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకన్నారు. 

గాడ్ ఫాదర్ క్రెడిట్ అంతా తన తనయుడు రామ్ చరణ్ కు ఇచ్చేశారు చిరంజీవి. అసలు ఈ సినిమా చేయడానికి కారణం రామ్ చరణ్ అని అన్నారు మెగాస్టార్ . మలయాళంలో లూసీఫర్ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా నువ్వు చేస్తే చాలా బాగుంటంది. నీ ఇమేజ్ కు ఈ కథ కరెక్ట్ గా సూట్ అవుతుంది అని చెప్పి.... ఆ సినిమా చూపించి.. ఒప్పించాడు చరణ్ అని అన్నారు మెగాస్టార్. అంతే కాదు ఈసినిమాకు కావల్సిన అన్ని తనే దగ్గరుండి చూసుకున్నారట రామ్ చరణ్. 

ఇక ఈ కథకు డైరెక్టర్ ఎవరు అయితే బాగుంటుంది అని అనుకున్నప్పుడు కూడా రామ్ చరణే ఒక అడుగు ముందుకు వేసి.. మోహన్ రాజా ఈ సినిమాకు ఫర్ఫెక్ట్ అని తేల్చాడట రామ్ చరణ్. ఆయన తమిళంలో చేసిన సినిమాల గురించి చెప్పి.  మోహన్ రాజాను డైరెక్టర్ గా రామ్ చరణే సెట్ చేశాడన్నారు మెగాస్టార్. తాము అనుకున్నదానికంటే ఎక్కువగా పనిచేసి చూపించాడు మోహన్ రాజా అంటూ  మెగాస్టార్ చిరంజీవి  మెచ్చుకున్నాడు. 

ఇక ఇంతటితో ఆపకుండా.. చరణ్ వల్లే ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్టీవ్ గా కొంత మంది ఆర్టిస్ట్ లు దొరికారన్నాడు చిరంజీవి. మెహన్ రాజా ఓ పాత్రకు సల్మాన్ ఖాన్ కావాటి అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అసలు ఆయన్ను తీసుకురాగలమా అని డౌట్ వచ్చింది. కాని  ఆ బాధ్యను కూడా రామ్ చరణే తీసుకుని.. ఒక్క ఫోన్ కాల్ తో సల్మాన్ ను ఒప్పించాడంటూ చరణ్ ను పొగడ్తలతో ముంచెత్తారు చిరంజీవి. అటు నయనతార హీరోయిన్ గా కావాలి అనకున్నప్పుడు కూడా చరణే ముందడుగు వేసి.. నయనతారను హీరోయిన్ గా సెట్ చేశాడంటూ మెగాస్టార్ అన్నారు. 

ఇలా సినిమాకు సంబంధించిన ప్రతీ ఒక్క విషయంలో రామ్ చరణ్ దగ్గరుండి చూసుకున్నాడన్నారు చిరంజీవి. డైరెక్టర్ మోహన్ రాజ పనిరాక్షసుడని. ఆయన ఓ అద్భుతమైన టెక్నీషియన్ అన్నారు చిరు. ఆయన కోరికలు ఆకాశంలో ఉంటాయి. సినిమా కోసం ఎంత దూరం వెళ్ళాలి అనుకున్నా వెళ్తాడు. గాడ్ ఫాదర్ ను ఆ పట్టుదలతోనే అద్భుతంగా తీర్చిదిద్దాడు. లూసిఫర్ కథను మనకు తగ్గటు మార్చి.. నా ఇమేజ్ కు సరిపోయేట్టు తీర్చి దిద్దడంలో మోహన్ రాజా సక్సెస్ అయ్యాడంటూ మెగాస్టార్ అన్నారు. 

ఇక వచ్చే నెల 5న దసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది గాడ్ ఫాదర్ మూవీ. ఈమూవీలో మెగాస్టార్ సరసన నయనతార నటించగా.. విలన్ గా సత్యదేవ్ నటించారు. ముళీ శర్మ, బ్రహ్మాజీ,షఫిలాంటి స్టార్స్ ఇంపార్టెంట్ రోల్స్ లో మెరిసారు. ఈమవీకి అద్భుతమైన సంగీతం అందించారు తమన్.యాక్షన్ సీన్స్ ను రామ్ లక్ష్మన్ డైరెక్ట్ చేశారు. 

click me!