చిరంజీవి నిహారిక పెళ్ళికి ఏం గిప్ట్ ఇస్తున్నాడో తెలుసా..

By Surya Prakash  |  First Published Dec 7, 2020, 7:15 PM IST

నిహారిక వివాహ వేడుకలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఉదయ్‌పూర్ చేరుకున్నారు.  


మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లితో టాలీవుడ్ మొత్తం పండగ వాతావరణం నెలకొంది. నిహారిక కొణిదెల వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 9న జొన్నలగడ్డ చైతన్యతో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ వేడుక జరగనుంది. నిహారిక వివాహ వేడుకలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ చేరుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన ఉదయ్‌పూర్ చేరుకున్నారు.  

అయితే మెగా కుటుంబంలో ఎవరి పెళ్లి జరిగినా అందరు కలిసి డ్యాన్సులు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అందులో టాలీవుడ్ టాప్ డ్యాన్సర్ చిరంజీవి స్టెప్పుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాకుండా టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్ నుంచి సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. వారు కూడా సంగీత్‌లో పాల్గొని ఎంజాయ్ చేస్తారు. మరి నిహారిక పెళ్లికి కూడా అంతే ఘనంగా ప్లాన్ చేస్తున్నారు మెగా సభ్యులు. 

Latest Videos

ఈ నేపధ్యంలో ఎలకేం  గిప్టులు ఇస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఎవరి రేంజ్‌కు తగ్గట్టుగా వారు తీసుకొస్తారు. ఇందులో చిరు గిప్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అందుతున్న సమాచారం మేరకు ఏకంగా కోటిన్నర విలువ చేసే ఓ ప్రత్యేక ఆభరణాన్ని సిద్దం చేశారంటున్నారు. అంతేకాదు కాబోయే అల్లుడికి కూడ అదిరిపోయే గిప్ట్ రెడీ చేశారట. ఇక చిరంజీవి భార్య సురేఖ ఇప్పటికే ఉదయ్‌పూర్ వెళ్లి పెళ్లి పనులను చూసుకుంటుంది.  

click me!