అల్లు అరవింద్ సైతం ఈ బిజినెస్ లోకి వచ్చి ఆహా అనే ఓటీటిని పెట్టి మార్కెట్లో మంచి విజయం సాధించారు. . ఈ సక్సెస్ కి కొనసాగింపుగా అన్నట్లుగా అల్లు అరవింద్ అండదండలతో బన్నీ వాసు తీసుకు వస్తున్న ఏటీటీ ఫ్రైడే మూవీస్.
కరోనా మహమ్మారి వలన అందరూ ఇళ్ళకు అతుక్కుపోయారు. ఇప్పడిప్పుడే కొంతవరకూ పరిస్ఠితులు ఓ కొలిక్కి వస్తున్నాయి. అయితే జనసంచారం వున్న ప్రదేశాలకు వెళ్ళాలంటే ఇంకా మనసులో భయం మాత్రం తగ్గటం లేదు. థియోటర్స్ ఓపెన్ అయినా అందుకే ధైర్యం చేయటం లేదు. ఇలాంటి సిట్యువేషన్ ఓటీటిలు భారీగా క్లిక్ అయ్యాయి. శ్రేయాస్ సంస్ధ వంటి వారు ఏటీటి లను రెడీ చేసి మార్కెట్లో ప్రవేశపెట్టారు. అల్లు అరవింద్ సైతం ఈ బిజినెస్ లోకి వచ్చి ఆహా అనే ఓటీటిని పెట్టి మార్కెట్లో మంచి విజయం సాధించారు. . ఈ సక్సెస్ కి కొనసాగింపుగా అన్నట్లుగా అల్లు అరవింద్ అండదండలతో బన్నీ వాసు తీసుకు వస్తున్న ఏటీటీ ఫ్రైడే మూవీస్.
ఈ నేపధ్యంలో వారి ప్రకటన ఇలా ఉంది.. మీ ఇంటికే వచ్చి మంచి సినిమాల్ని మీఇంట్లో మీకు సర్వ్ చేయబోతుంది. ప్రతి శుక్రవారం వచ్చిందంటే ఏ సినిమా విడుదలవుతుందో పేపర్స్ లో చూసుకుని టికెట్స్ బుక్ చేసుకుని ట్రాఫిక్ లో దియెటర్ కి వెళ్ళి పార్కింగ్ చేసుకునేలోపు సినిమా స్టార్టవుతుందేమో అనే కంగారు ఇక నుండి లేకుండా ఇక నుండి ఫ్రైడే మూవీస్ మీ ముందుకు వస్తుంది. దీనికోసం మీరేమి చెయ్యాలంటే 7997666666 నెంబర్ కి సింగిల్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ మోబైల్ లో ఫ్రైడే మూవీస్ యాప్ చేరుతుంది. మీ ఆనందాన్ని మీ మోబైల్ లో వుంచుతుంది. ప్రతి వారం కొత్త సినిమాల తో పాటు సర్‌ప్రైజ్ చేసే మరికొన్ని అంశాలుంటాయి.
అయితే అదే సమయంలో ఓటీటీ ఉండగా ఏటీటీ ఎందుకు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. దానికి వారు చెబుతున్న సమాధానం చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.నిర్మాతల లాభం కోసం ఏటీటీ ని తీసుకు వస్తున్నట్లుగా చెబుతున్నారు. ఓటీటీలో అమ్మితే సినిమాకు ఒక్కసారే డబ్బులు వస్తాయి.అదే ఏటీటీలో సినిమాను ఉంచితే ప్రతి రోజు డబ్బులు వస్తాయి. సినిమా బాగుంటే భారీగా లాభాలు వస్తాయి. డైరెక్ట్ గా ప్రేక్షకులు చెల్లించే మొత్తం ను ఏటీటీ ద్వారా నిర్మాత ఖాతా లో పడతాయి.తద్వారా నిర్మాతకు కంటిన్యూస్ గా డబ్బులు వస్తాయి.సినిమా సక్సెస్ అయితే థియేటర్లలో విడుదల అయిన సమయంలో ఎలా అయితే లాభాలు వస్తాయో అలాగే ఏటీటీ ద్వారా కూడా వస్తాయి. అలాగే చిన్న సినిమాలకు తక్కువ రేటు పెట్టడం వల్ల ఎక్కవ మంది చూస్తారు.తద్వారా నిర్మాతల కు లాభం ఉంటుందని అంటున్నారు.ఓటీటీ ల కంటే కూడా ఏటీటీ లకే మంచి భవిష్యత్తు ఉందని తేలుస్తున్నారు.
అంతే కాకుండా ఏటీటీలో విడుదల చేసుకున్న కొన్ని రోజుల తర్వాత ఓటీటీలకు సినిమాలను నిర్మాతలు అమ్ముకోవచ్చు అంటున్నారు.ఏటీటీల ద్వారా రెండు రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఫ్రైడే మూవీస్ అనే ఏటీటీ ని తీసుకు వస్తున్నట్లుగా చెబుతున్నారు. డిసెంబర్ 18 నుండి ఫ్రైడే మూవీస్ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది. తన మెదటి ఎంటర్‌టైన్ మెంట్ గిఫ్ట్ గా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత ఎం ఎస్ రాజు దర్శకుడి గా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ డర్టీ హరి చిత్రాన్ని ఫ్రైడే మూవీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.