రాజు కిరీటం ధరించి అరియానాకి చుక్కలు చూపించిన సోహైల్‌.. హారికపై ఫైర్‌

Published : Dec 07, 2020, 06:31 PM IST
రాజు కిరీటం ధరించి అరియానాకి చుక్కలు చూపించిన సోహైల్‌.. హారికపై ఫైర్‌

సారాంశం

అఖిల్‌ ఇప్పటికే గ్రాండ్‌ఫినాలేకు చేరుకున్నారు. తాజాగా పంచుకున్న బిగ్‌బాస్‌ ప్రోమోల్లో సోహైల్‌, హారిక రాజు, రాణిలుగా కనిపిస్తున్నారు. వీరిద్దరు మిగిలిన సభ్యులను శాషిస్తున్నట్టుగా ఉంది. మొదటి ప్రోమోలో సోహైల్‌ కిరీటాన్ని దక్కించుకుని రాజుగా మారాడు. 

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ చివరికి చేరుకుంది. ప్రస్తుతం 14వ వారం ప్రారంభమైంది. నామినేషన్‌కి చివరి వారమిదే. ఈ వారం కూడా అఖిల్‌ తప్ప మిగిలిన వారంతా నామినేట్‌ అయినట్టు తెలుస్తుంది. అఖిల్‌ ఇప్పటికే గ్రాండ్‌ఫినాలేకు చేరుకున్నారు. తాజాగా పంచుకున్న బిగ్‌బాస్‌ ప్రోమోల్లో సోహైల్‌, హారిక రాజు, రాణిలుగా కనిపిస్తున్నారు. వీరిద్దరు మిగిలిన సభ్యులను శాషిస్తున్నట్టుగా ఉంది. మొదటి ప్రోమోలో సోహైల్‌ కిరీటాన్ని దక్కించుకుని రాజుగా మారాడు. ఆయన ఆజ్ఞ ప్రకారమే మిగతా ఇంటి సభ్యులు నడుచుకోవాల్సి ఉంటుంది. 

అయితే రాజుగా మారిన సోహైల్‌.. అరియానాకి చుక్కలు చూపించాడు. ఆమె మోయలేనన్ని పనులు అప్పగించాడు. దీంతో ఇది గమనించిన అభిజిత్‌.. మహారాజా ఇది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం కదా` అంటే పంచ్‌ వేశాడు. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన రాజుగా ఆరియానా చేసిన తప్పులకు శిక్షలు విధిస్తున్నాడు. రాక్షసుల టాస్క్ లో అరియానా ఎంత రాక్షసంగా ప్రవర్తించిందని మండిపడ్డాడు. ఆమెపై నీళ్లు పోసి, గుడ్లు పగులకొడుతూ చిత్ర హింసలు పెట్టాడు సోహైల్‌. 

ఇక అరియానా స్పందించి నేను కూడా రాణి అయ్యే అవకాశం ఉందని చెప్పడంతో.. అమ్మో నాకు ఫ్యూచర్‌ కనిపిస్తోందని సోహైల్‌ బెంబెలెత్తిపోయాడు. ఇది చాలా ఫన్నీవేలో గేమ్‌ సాగుతున్నట్టు అర్థమవుతుంది. మరో ప్రోమోలో హారిక రాణి అయ్యింది. సోహైల్‌ బట్టలు నీళ్లల్లో పడేసింది. దీంతో సోహైల్‌ ఫైర్‌ అయ్యాడు. ఏం చేస్తాడో చూస్తా అంటూ చైర్‌ లాగేశాడు. మరోవైపు సోహైల్‌కి, అఖిల్‌ కి మధ్య వివాదం జరిగింది. ఇందులో సోహైల్‌ వైపు అభిజిత్‌ ఉండటం ఆసక్తిగా మారింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే