పట్టలేని ఆనందం.. ‘లిటిల్ మెగా ప్రిన్సెస్’ అంటూ మనవరాలికి స్వాగతం పలికిన చిరు..

By Asianet News  |  First Published Jun 20, 2023, 10:59 AM IST

మెగా ఫ్యామిలీ పట్టలేని ఆనందంలో మునిగితేలుతోంది. ఉపాసన కొణిదెల పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో చిరు మురిసిపోతున్నారు. తన మనవరాలికి స్వాగతం పలుకుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. 
 


మెగా ఫ్యామిలీ సంబురంలో మునిగి తేలుతోంది. రామ్ చరణ్ - ఉపాసన  తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగా లిటిల్ ప్రిన్సెస్  కు వెల్క్ చెబుతూ.. రామ్ చరణ్ - ఉపాసనలకు శుభాకాంక్షలు చెబుతున్నారు. నెట్టింట విషెస్ తో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.  Mega Princess  హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. అంతటా మెగా ప్రిన్స్ మాటే వినిపిస్తోంది. 

అయితే, తన మనవరాలికి స్వాగతం పలుకుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. పట్టలేని ఆనందంలో మునిగి తేలుతున్నా చిరు ఎమోషనల్ గా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘లిటిల్ మెగా పిన్సెస్ కు స్వాగతం. నీ రాకతో కోట్లాది మంది మెగా ఫ్యామిలీలో ఆనందం వెదజల్లావు. రామ్ చరణ్, ఉపాసనకు ఎప్పుడూ అందరీ దీవెనలు ఉన్నాయి. తాతగా చాలా ఆనందంగా ఉంది. గర్విస్తున్నాను.’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. 

Latest Videos

నిన్న రాత్రే ఉపాసన కొణిదెల హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అన్ని పరీక్షల తర్వాత వైద్యులు ఈరోజు ఉదయం డెలివరీ చేశారు. పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చిందని ఆస్పత్రి బృందం వెల్లడించింది. ఈ శుభావార్త తెలియగానే మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఆస్పత్రికి చేరుకున్నారు. లిటిల్ మెగా ప్రిన్స్ కు స్వాగతం పలికారు. రామ్ చరణ్ - ఉపాసనకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ తండ్రికావడంతో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తనుకున్నబిజీ షెడ్యూల్ ను ఓ మూడు నెలల వరకు పొడిగించారని తెలుస్తోంది. ఈ సమయం మొత్తం ఫ్యామిలీకే కేటాయించేలా ప్లాన్ చేశారంట. మొత్తానికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న క్షణం రావడం, మహాలక్ష్మి రాకతో మెగా ఇంట పట్టలేని ఆనందం కనిపిస్తోంది. 

Welcome Little Mega Princess !! ❤️❤️❤️

You have spread cheer among the
Mega Family of millions on your arrival as much as you have made the blessed parents & and us grandparents, Happy and Proud!! 🤗😍

— Chiranjeevi Konidela (@KChiruTweets)
click me!