తన ఇంట్లో పని చేసే అమ్మాయికి టార్గెట్ ఫిక్స్ చేసి మరీ సాయం చేసిన బన్నీ.. పుష్పరాజ్ వెరీ కూల్ 

By Asianet NewsFirst Published Nov 30, 2023, 1:14 PM IST
Highlights

తన ఇంట్లో పని చేసే పని మనిషికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగేలా బన్నీ సాయం చేశాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా గడుపుతున్నారు. నేడు తెలంగాణలో పోలింగ్ డే కావడంతో బన్నీ ఉదయాన్నే క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న సంగతి తెలిసిందే. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

బన్నీకి సంబంధించిన మరో వీడియో వైరల్ గా మారింది. బన్నీ ఎప్పుడూ కూల్ యాటిట్యూడ్ తో ఉంటారు. ఆన్ స్క్రీన్ లో మాత్రమే ఫైర్ ఉంటుంది. తాజాగా మరోసారి అల్లు అర్జున్ తన మంచి మనసు చాటుకున్నారు. 

Latest Videos

తన ఇంట్లో పని చేసే పని మనిషికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగేలా బన్నీ సాయం చేశాడు. తాను పెద్ద స్టార్ ని ఇలాంటి విషయాలు పట్టించుకోకూడదు లాంటి గర్వం ఏమాత్రం లేకుండా ఆ అమ్మాయి కోసం బన్నీ వీడియో చేశారు. నీకు ఎంత మంది ఫాలోవర్స్ కావాలి.. ఇప్పుడు ఎంత మంది ఉన్నారు ? అని అల్లు అర్జున్ ఆమెని అడగడంతో ఆమె 13వేల మంది ఉన్నారు. 20 లేదా 30 వేలు వస్తే చాలు అని బన్నీకి తెలిపింది. 

అల్లు అర్జున్ మంచి మనసు... తన ఫ్యాన్ కి ఫాలోవర్స్ రావాలని ఏం చేశారో చూడండి pic.twitter.com/M8vIi1IKGQ

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఒకే 30 ఫిక్స్ అంటూ బన్నీ సెల్ఫీ వీడియో తీశాడు. ఆ అమ్మాయి ఈ వీడియో తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. క్షణాల్లో వైరల్ గా మారిపోయింది. పుష్పరాజ్ స్వయంగా చెబితే ఫ్యాన్స్ ఆగుతారా.. వెంటనే ఇంస్టాగ్రామ్ లో ఆ అమ్మాయిని ఫాలో కావడం ప్రారంభిస్తున్నారు. అల్లు అర్జున్ గోల్డ్ అని, అన్నయ్య బంగారం అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

click me!