నా కెరీర్ లోనే అత్యంత కష్టమైన క్లైమాక్స్.. పుష్ప2 పై అంచనాలు పెంచేసిన అల్లు అర్జున్ 

ఇటీవల పుష్ప 2 రిలీజ్ పోస్ట్ పోన్ కావడం.. ఆ తర్వాత కొన్ని  రూమర్స్ రావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అభిమానుల నిరాశని, అనుమానాల్ని పటాపంచలు చేస్తూ అల్లు అర్జున్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సరికొత్త జోష్ తీసుకువచ్చాయి.


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల పుష్ప 2 రిలీజ్ పోస్ట్ పోన్ కావడం.. ఆ తర్వాత కొన్ని  రూమర్స్ రావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. 

అభిమానుల నిరాశని, అనుమానాల్ని పటాపంచలు చేస్తూ అల్లు అర్జున్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సరికొత్త జోష్ తీసుకువచ్చాయి. సుకుమార్ సతీమణి తబిత నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 

Latest Videos

ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ పుష్ప 2పై అదిరిపోయే కామెంట్స్ చేశారు. నా కెరీర్ లోనే పుష్ప 2 క్లైమాక్స్ అత్యంత కష్టమైన క్లైమాక్స్ అని అల్లు అర్జున్ అభివర్ణించారు. క్లైమాక్స్ షూట్ వల్ల చాలా అలసిపోయినట్లు తెలిపారు. సాధారణంగా నా సినిమా గురించి నేను ఎక్కువ చెప్పుకోను. 

కానీ పుష్ప 2 మాత్రం ఫ్యాన్స్ అసలు తగ్గేదేలే అన్నట్లుగా ఉంటుంది అని తెలిపారు. ప్రీ రిలీజ్ వేడుకలో సుకుమార్, బన్నీ మధ్య బాండింగ్ అన్ని అనుమానాలకు చెక్ పెట్టేసినట్లు అయింది. 

click me!