సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మెగాస్టార్ బెస్ట్ విషెస్.. చిన్నారుల పాలిట సహృదయుడంటూ ప్రశంసలు..

Published : Aug 09, 2022, 12:04 PM ISTUpdated : Aug 09, 2022, 05:01 PM IST
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మెగాస్టార్ బెస్ట్ విషెస్.. చిన్నారుల పాలిట సహృదయుడంటూ ప్రశంసలు..

సారాంశం

సూపర్ స్టార్ మహేశ్  బాబు (Mahesh Babu) పుట్టిన రోజు  సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలిపారు. మహేశ్ బాబును ప్రశంసిస్తూ.. తన మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు.

మహేశ్ బాబు తన ఫ్యామిలీ ఇటీవలనే వేకేషన్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆగస్గులోనే మహేశ్ బాబు పుట్టిన రోజు ఉండటంతో విదేశాల్లోనే సెలబ్రేషన్స్ జరుపుకుంటారేమోనని అభిమానులు భావించారు. కానీ రెండు రోజుల కింద హైదరాబాద్ కు చేరుకోవడంతో ఇక్కడే సెలబ్రేషన్స్ కు ప్రియేర్ అయ్యారు. ఈ రోజు (ఆగస్టు 9న) సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు (Mahesh Babu Birthday). దీంతో సూపర్ స్టార్ 47వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు అభిమానులు, సినీ ప్రముఖులు మహేశ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా తన బెస్ట్ విషెస్ ను తెలియజేశారు.

ఈ సందర్భంగా  మహేశ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. అలాగే ఆయన వ్యక్తిత్వంపైన ప్రశంసల వర్షం కురిపించారు. ‘ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని, సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు సూపర్ స్టార్ మహేశ్ బాబు’ అంటూ ట్వీటర్ వేదికన విషెస్ తెలిపారు. సోషల్ మీడియాలో అటు అభిమానులూ మహేశ్ పోస్టర్లతో విషెస్ తెలుపుతున్నారు. 

మహేశ్ బాబు అటు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించడంతో పాటు.. ఇటు చిన్నారుల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఎంబీ ఫౌండేషన్ (MB Foundation) ద్వారా పేద పిల్లల గుండె సంబంధిత వ్యాధులకు మెరుగైన చికిత్స అందిస్తూ చిన్నారుల మొహంపై చిరునవ్వును తెప్పిస్తున్నారు. ఇప్పటికే 1000కిపైగా చిన్నారులకు శస్త్రచికిత్స చేయించారు. తమ ఫౌండేషన్ ద్వారా పేదలకు, విద్యార్థులకు కావాల్సిన నీడ్స్ ను కూడా అందజేస్తూ పెద్ద మనస్సును చాటుకుంటున్నారు. 

చివరిగా ‘సర్కారు వారి పాట’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మహేశ్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంతో తన 28వ చిత్రంలో నటించనున్నారు. ఈ నెలలో  ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో ‘ఎస్ఎస్ఎంబీ29’ కోసం పనిచేయనున్నారు. మొన్నటితో మహేశ్ బాబు వేకేషన్ పూర్తవడంతో మున్ముందు క్రేజీ అప్డేట్స్ రానున్నట్టు తెలుస్తోంది.

 

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది