ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్.. కేక పెట్టిస్తున్న ఊరమాస్ పోస్టర్

pratap reddy   | Asianet News
Published : Oct 09, 2021, 11:24 PM IST
ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్.. కేక పెట్టిస్తున్న ఊరమాస్ పోస్టర్

సారాంశం

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం 'ఆచార్య'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మెగాస్టార్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలని దట్టించి వడ్డించబోతున్నారు కొరటాల శివ.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం 'ఆచార్య'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మెగాస్టార్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలని దట్టించి వడ్డించబోతున్నారు కొరటాల శివ. కరోనా కారణంగా ఎప్పటికప్పుడు ఈ చిత్ర రిలీజ్ డేట్ వాయిదా పడుతూనే ఉంది. పరిస్థితులు నార్మల్ గా ఉంటే దసరా సీజన్ లో ఆచార్య చిత్రం రిలీజ్ కావలసింది. 

కానీ చిత్ర పరిశ్రమకు థియేటర్స్, టికెట్ ధరల సమస్యలు ఎలాగూ ఉన్నాయి. దీనితో ఆచార్య దసరా రేసు నుంచి తప్పుకుంది. దీనితో ఆచార్య కొత్త రిలీజ్ డేట్ కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు Acharya టీం ఈ చిత్ర రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. ఫిబ్రవరి 4, 2022న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 

దీనితో ఆచార్య చిత్రం సోలో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు అయింది. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ చిత్ర యూనిట్ ఊరమాస్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో మెగాస్టార్ Chiranjeevi పవర్ ఫుల్ లుక్ లో దర్శనం ఇస్తున్నారు. బ్యాగ్రౌండ్ లో రాంచరణ్ ని కూడా చూడొచ్చు. 

Also Read: 'మహా సముద్రం' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అను ఇమ్మాన్యుయేల్, అదితి గ్లామర్ మెరుపులు

రాంచరణ్ ఈ చిత్రంలో సిద్ద పాత్రలో కీలక రోల్ ప్లే చేస్తున్నాడు. చిరంజీవికి జోడిగా రెండవ సారి కాజల్ నటిస్తోంది. మణిశర్మ సంగీత దర్శకుడు. చాలా కాలం తర్వాత చిరంజీవి చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్న చిత్రం ఇది. దేవాలయాల భూములకు సంబంధించి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉండబోతున్నట్లు టాక్. 

 

PREV
click me!

Recommended Stories

Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు
Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ