‘‘మా ’’ ఎన్నికలు: ఓటుకి రూ.25 వేలు, ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌పై నరేశ్ ఆరోపణలు.. శ్రీకాంత్ కౌంటర్

By Siva KodatiFirst Published Oct 9, 2021, 11:01 PM IST
Highlights

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) (Maa elections) ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి చివరి రోజు కావడంతో మంచు విష్ణు (manchu vishnu), ప్రకాశ్ రాజ్ (prakash raj) ప్యానెల్స్‌ క్యాంపెయిన్ హోరాహోరీగా నిర్వహించారు. ఇదే సమయంలో నాగబాబు (naga babu) వ్యాఖ్యలకు విష్ణు కౌంటరిచ్చారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) (Maa elections) ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి చివరి రోజు కావడంతో మంచు విష్ణు (manchu vishnu), ప్రకాశ్ రాజ్ (prakash raj) ప్యానెల్స్‌ క్యాంపెయిన్ హోరాహోరీగా నిర్వహించారు. ఇదే సమయంలో నాగబాబు (naga babu) వ్యాఖ్యలకు విష్ణు కౌంటరిచ్చారు. ఇది జరిగిన కాసేపటికే మా ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ నరేశ్ (naresh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ డబ్బులు పంచుతున్నారంటూ నరేశ్ వీడియో విడుదల చేశారు. రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు పంచుతున్నారని ఇందుకోసం మూడు సెంటర్లు ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. తాను అబద్ధాలు చెప్పనని.. మేనిఫెస్టో విడుదల చేయకుండా డబ్బును నమ్ముకున్నారంటూ నరేశ్ ఎద్దేవా చేశారు. 

Also Read:అంకుల్.. నేనూ మీ వరుణ్‌ లాంటి వాణ్ణే, ‘‘మా’’ ఎన్నికల్లో గెలిస్తే కిరీటాలొస్తాయా: నాగబాబుకి విష్ణు కౌంటర్

అయితే ఆ వెంటనే నరేశ్‌కు .. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన హీరో శ్రీకాంత్ (srikanth) కౌంటరిచ్చారు. నరేశ్ మద్ధతు ఇస్తున్న ప్యానెల్ వాళ్లే డబ్బులు పంచుతున్నారని ఆయన ఆరోపించారు. మాలో డబ్బులు కాజేయడంతో పాటు సంస్థను నాశనం చేశారని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. నరేశ్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. తాము మందు బాటిళ్లు, డబ్బులు ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. మేం డబ్బులు పంచితే అమ్మవారే నాశనం చేస్తారని శ్రీకాంత్ జోస్యం చెప్పారు. దయచేసి మా సభ్యులు ఇలాంటి ప్రలోబాలకు లోంగవద్దని ఆయన పిలుపునిచ్చారు. 

‘మా’ ఎన్నికల నేపథ్యంలో మెగాబ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై మా అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు కౌంటరిచ్చారు. ఈ మేరకు శనివారం ఓ వీడియోను విడుదల చేశారు. చిరంజీవి అంటే తనకు ఎంతో గౌరవమని, మిమ్మల్ని విమర్శిస్తే, ఆయనను విమర్శించినట్లు అవుతుందని అన్నారు. అందుకే తాను నాగబాబుపై విమర్శలు చేయనని విష్ణు చెప్పారు.  

ఆ వీడియోలో విష్ణు ఏమన్నారంటే.. తాను ‘మా’ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నానని అనౌన్స్ చేసిన నాటి నుంచి ప్రత్యర్థి ప్యానెల్‌ సభ్యులు నాపైనా, నా కుటుంబం పైనా విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆ ప్యానెల్‌లో ఉన్న సీనియర్‌ నటి కూడా నాన్నగారిపై విమర్శలు గుప్పించారని.. ఏదో ఒక దశలో ఇదంతా ఆపుతారని అనుకున్నానని.. కానీ తాను చేసే ప్రతి పనీ తప్పు అంటూ చిల్లరగా మాట్లాడుతున్నారని విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత మనమనంతా ఒకే కుటుంబం అన్న సంగతిని వాళ్లు మర్చిపోతున్నారని.. ఓడిపోతున్నారనే అక్కసుతోనే విమర్శలు చేస్తున్నారని విష్ణు అన్నారు. అక్కడ అధ్యక్ష అభ్యర్థిగా నిలబడిన వ్యక్తి స్వార్థంతో పోటీ చేస్తున్నారని.. అతన్ని నిలబెట్టిన వ్యక్తుల్లో ఒకరు బహిరంగంగా బయటకు వచ్చి, వాళ్ల తరపున నన్ను విపరీతంగా విమర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

 

"

click me!