సెకండ్ ఇన్నింగ్స్ లో ఏజ్ ను కూడా మర్చిపోయి జోష్ మీద ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. మధ్యలో ఫెయిల్యూర్స్ వస్తున్నా. లెక్క చేయకుండా.. వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ఈ దసరాకు గాడ్ ఫాదర్ తో రాబోతున్న మెగాస్టార్.. 154 మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారట.
సెకండ్ ఇన్నింగ్స్ లో ఏజ్ ను కూడా మర్చిపోయి జోష్ మీద ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. మధ్యలో ఫెయిల్యూర్స్ వస్తున్నా. లెక్క చేయకుండా.. వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. ఈ దసరాకు గాడ్ ఫాదర్ తో రాబోతున్న మెగాస్టార్.. 154 మూవీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారట.
గెలుపోటములు పట్టించుకోకుండా.. ఫుల్ జోష్ మీద ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ప్లాప్ అవ్వని.. హిట్ అవ్వనీ... ఏదైనా కాని.. ఒకదాని వెంట ఒకటి సినిమాలను ట్రాక్ ఎక్కిస్తున్నాడు. రీసెంట్ గా ఆచార్య సినిమాతో మెగాస్టార్ తీవ్ర నిరాశచెందారు.. ఇక ఈ దసరాకు గాడ్ ఫాదర్ సినిమాతో ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఈ దసరాకు గాడ్ ఫాదర్ తో మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టబోతున్న చిరు.. నెక్ట్స్ తన సినిమా రిలీజ్ పై ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
నెక్ట్స్ సినిమాలతో.. ఫ్యాన్స్ కాలర్ ఎగిరెసుకునేలా హిట్టు ఇవ్వాలని కసితో ఉన్నాడు చిరంజీవి. అందుకు తగ్గట్టుగానే ప్రిపేర్ అవుతున్నాడు. సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు మెగాస్టార్. ప్రస్తుత చిరు చేతిలో నాలుగు సినిమాలున్నాయి.
ఇక ప్రస్తుతం తన 154వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇతర పాత్రల్లో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు కనిపించనున్నారు. ముఖ్యమైన పాత్రలో మాస్ మహారాజ్ రవితేజ నటించారీ మూవీలో.
మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఇంకా టైటిల్ కూడా ఫిక్స్ చేయని ఈ సినిమా గురించి ఓ అప్ డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదల తేదీని ఖరారు చేసుకుందట. వచ్చే ఏడాది జనవరి 13న చిరంజీవి 154వ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని సమాచారం. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ను టీమ్ అనౌన్స్ చేయాల్సి ఉంది. దీనిపై మేకర్స్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతుండగా...ఆర్థర్ ఏ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ దసరాకు రిలీజ్ కాబోతున్న గాడ్‌ఫాదర్ సినిమా నుంచి సల్మాన్, చిరు కాంబోలో కాదు కదిపి.. చిందేసిన తార్ మార్ తక్కర్ మార్ లిరికల్ పాట ప్రోమో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సాధించింది. ఇక ఈమూవీపై అంచనాలుభారీగా పెరుగుతున్నాయి.