
మంచు విష్ణు చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ట్రోల్స్ కి కారణమైంది. అడవి దున్నపోతు ఫోటో పోస్ట్ చేసిన మంచు విష్ణు... పది పుష్ అప్స్ తీశాక నేను ఇలా ఫీల్ అవుతాను అని కామెంట్ చేశాడు. పుష్ అప్స్ అనంతరం ఆయన దున్నపోతు అంత బలంగా తయారైనంత ఫీలింగ్ కలుగుతుందన్న అర్థంలో మంచు విష్ణు ఆ ట్వీట్ చేశారు. కారణం ఉన్నా లేకున్నా మంచు విష్ణును ట్రోల్ చేయడానికి సిద్ధంగా ఉండే జనాలు మంచు విష్ణును ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. కామెంట్స్ సెక్షన్లో ఆడుకుంటున్నారు. '' నిజమే అన్నా మీరు జస్ట్ మా ప్రెసిడెంట్ కానీ ఇండియా ప్రెసిడెంట్ లా ఫీల్ అవుతున్నారు'' అంటూ సెటైర్ వేశారు.
హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తున్నాడు మంచు విష్ణు. ఆయన క్లీన్ హిట్ అందుకొని ఏళ్ళు గడచిపోతుంది. మంచు విష్ణుతో సినిమాలు చేయడం నిర్మాతలు ఎప్పుడో మానేశారు. దీంతో సొంత నిర్మాణ సంస్థలు చిత్రాలు చేసుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో మోసగాళ్లు మూవీ చేశారు. కాజల్, సునీల్ శెట్టి వంటి స్టార్ క్యాస్ట్ నటించిన ఈ మూవీ ఫలితం కూడా డిజాస్టరే. సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన మోసగాళ్లు మంచు విష్ణుకు భారీ నష్టాలు మిగిల్చింది.
ఇక ఆయన లేటెస్ట్ మూవీ జిన్నా. దర్శకుడు సూర్య కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ లో విడుదల కానున్న ఈ మూవీ పైన మంచు విష్ణు చాలా ఆశలే పెట్టుకున్నారు. జిన్నా మూవీలో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.