
హిట్, ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా ముందుకు వెళ్తున్న హీరో శ్రీవిష్ణు. ఆయన ప్రస్తుతం ‘అల్లూరి’ అనే పవర్‌ఫుల్ సినిమాతో మనముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ‘నిజాయితీకి మారుపేరు’ అనే ట్యాగ్‌లైన్ . కెరీర్‌లో తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు నటిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ ట్రైలర్ ఓ పోలీస్ కథని కొత్త కోణంలో చెప్పేందుకు ప్రయత్నం చేస్తోంది. మీరూ ఆ ట్రైలర్ చూడండి.
‘పోలీసంటే ఒక వ్యక్తి కాదు సర్ వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఒక పోలీసు ఆఫీసర్ చనిపోతే ఆ స్థానంలోకి మరో పోలీసు ఆఫీసర్ వస్తాడు సర్’ అంటూ పోలీసుల పవరేంటో తెలియజేస్తున్నారు నటుడు శ్రీవిష్ణు (Sree Vishnu). ఆయన పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అల్లూరి’ (Alluri). ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకురాబోతున్న నేపథ్యంలో ట్రైలర్‌ని నటుడు నాని విడుదల చేశారు.
‘లక్ష్యం పెట్టుకోవటం, దాన్ని సాధించటం గొప్పకాదు. లక్ష్య సాధన కోసం చేసే పోరాటం అద్భుతం’ అని తనికెళ్ల భరణి.. హీరోలో స్ఫూర్తినింపే డైలాగుతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం అలరించింది. భరణి చెప్పిన మాటలను ఆచరణలో పెట్టిన హీరో ఏం చేశాడు? ఎంత నిజాయతీగా పనిచేశాడు? తదితర సన్నివేశాలకు సంబంధించిను ట్రైలర్‌లో చూపించారు. ఎ. ఎస్. రామరాజు పాత్రలో శ్రీవిష్ణు ఒదిగిపోయారు. ఆయన చేసిన ఈ కొత్త ప్రయత్నం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మరి, అక్రమార్కులను తుదముట్టించేందుకు అల్లూరి చేపట్టిన మిషన్ ఏంటి? ఆ సంఘటన చూసి ఎంతమంది పోలీసులుగా మారారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఫిక్షన్ బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకుడు.