రజినీ సినిమాలో న‌టిస్తున్న మెగాస్టార్

Published : Dec 13, 2016, 03:50 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
రజినీ సినిమాలో న‌టిస్తున్న మెగాస్టార్

సారాంశం

సూపర్ స్టార్ రజినీకాంత్ తో క‌లిసి న‌టిస్తున్న మెగాస్టార్ చిరంజీవి రజినీకాంత్ ,శంకర్ కాంబినేషన్ లో రోబో సీక్వెల్ గా వ‌స్తున్న 2.0  క్లైమాక్స్ కు ముందు వ‌చ్చే గెస్ట్ రోల్ చేస్తున్న మెగాస్టార్

 

రజినీ సినిమాలో ఫలానా హీరో నటించబోతున్నాడంటూ రకరకాల ప్రచారాలు జరిగాయ్ కానీ.. 2.0లో మెగాస్టార్ చిరంజీవిని నటింపచేయనున్నారనే టాక్ లేటెస్ట్ గా మొదలైంది. క్లైమాక్స్ కు ముందు వచ్చే ఓ ఎపిసోడ్ సినిమాకి కీలకంగా కాగా.. ఆ ఎపిసోడ్ ను చిరంజీవి చేస్తే.. తెలుగులో ఈ చిత్రానికి బోలెడంత వర్త్ పెరుగుతుందని యోచిస్తున్నారట రోబో దర్శక నిర్మాతలు.

 ఇప్పటికే చిరును ప్రత్యేకించి అడగారట కూడా. అసలే రజినీకాంత్ సినిమా.. అందులోనూ శంకర్ తో నటించాలనే కోరికను గతంలోనే వెల్లడించిన చిరు.. వెంటనే ఈ ఆఫర్ ను ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ కూడా మొదలైపోనుందని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. 

గతంలో కూడా చిరంజీవి-రజినీకాంత్ లు కలిసి రెండు సినిమాల్లో నటించారు. మాప్పిళ్లై (అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడుకి తమిళ్ రీమేక్)..  రవున వీరన్ సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు 2.0 కోసం ప్రీక్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే ఈ రోల్ ను చిరంజీవితో కానీ.. మహేష్ బాబుతో కానీ చేయించాలని భావించారట. చివరకి చిరుకే మొగ్గారని.. కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

 అయితే.. ఈ పాత్రను ఎవరు పోషించారనే విషయాన్ని చివరివరకూ బయటకు చెప్పే ఉద్దేశ్యం 2.0 నిర్మాతలకు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆడియన్స్ ను థ్రిల్ చేయడం కోసమే ఇదంతా అంటున్నారు లెండి.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్